గాయం కారణంగా 5 నెలలపాటు క్రికెట్‌కు దూరంగా ఉన్న క్రికెటర్ పృథ్వీషా (Prithvi Shaw) రంజీల్లో అదరగొడుతున్నాడు. రంజీల్లో ముంబయి (Mumbai) తరఫున ఆడుతన్న అతడు.. ఛత్తీస్ ఘడ్ పై భారీ శతకం సాధించాడు. దీంతో భారత క్రికెట్ చరిత్రలో అరుదైన ఘనత నమోదు చేశాడు. గ్రూప్ B మ్యాచ్‌లో ఛత్తీస్‌గఢ్‌పై 185 బంతుల్లోనే 159 పరుగులు చేశాడు పృథ్వీషా. ఇందులో 18 ఫోర్లు, 3 సిక్సులున్నాయి.
ఫస్ల్ క్లాస్ క్రికెట్‌లో షా కు ఇది 13 సెంచరీ కాగా.. గత 4 ఇన్నింగ్స్‌లో మూడో సెంచరీ కావడం గమనార్హం. తొలి రోజు లంచ్‌కు ముందే కెరీర్‌లో రెండు శతకాలు చేసిన క్రికెటర్‌గా అవతరించాడు. ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో ఇప్పటి వరకు ఈ ఘనతను ఎవరూ అందుకోలేదు.
గతంలో అసోంపై 379 బంతుల్లో 383 పరుగులు చేసిన పృథ్వీ.. రంజీ ట్రోఫీలోనే రెండో అత్యధిక స్కోరు సాధించాడు. అప్పుడు కూడా మొదటి రోజు లంచ్‌కు ముందే సెంచరీ కొట్టేశాడు. 24 ఏళ్ల పృథ్వీషా మళ్లీ జాతీయ జట్టులోకి రావాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడు.
కాగా ఛత్తీస్‌గడ్‌పై మ్యాచ్‌లో భుపేన్ లాల్వానీతో కలిసి పృథ్వీ షా మొదటి వికెట్‌కు 244 పరుగుల భారీ పార్టనర్‌షిప్ నెలకొల్పాడు. దీంతో ముంబై 310/4 వద్ద మొదటి రోజు ఆట ముగిసింది. ప్రస్తుతానికి 5 మ్యాచ్‌లు ఆడిన ముంబై 4 విజయాలు, 1 ఓటమితో గ్రూప్-బీలో అగ్రస్థానంలో ఉంది.