Champions Trophy Final : ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ చేరే జట్లివే: పాంటింగ్

Update: 2025-02-03 10:30 GMT

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌కు భారత్, ఆస్ట్రేలియా వెళ్తాయని భావిస్తున్నట్లు ఆస్ట్రేలియన్ మాజీ క్రికెటర్ రికీ పాంటింగ్ తెలిపారు. ఆ రెండు జట్లు చెరో రెండు సార్లు ట్రోఫీని సొంతం చేసుకున్నట్లు చెప్పారు. వీటికి పోటీగా హోంగ్రౌండ్స్‌ కావడంతో పాకిస్థాన్ రేసులో ఉంటుందన్నారు. ఈ జట్టు అంచనాలకు దొరకకుండా ప్రదర్శన చేస్తుందన్నారు. పాంటింగ్ వ్యాఖ్యలతో మాజీ కోచ్ రవిశాస్త్రి ఏకీభవించారు.

‘‘ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌లో అడుగు పెట్టేది భారత్, ఆస్ట్రేలియా అని అనుకుంటున్నా. రెండేసి సార్లు ఈ ట్రోఫీని ఆ రెండు టీమ్‌లు సొంతం చేసుకున్నాయి. ఇటీవల ప్లేయర్ల ప్రదర్శన కూడా అద్భుతంగా ఉంది. అయితే వీరికి పోటీగా మరో జట్టు కూడా రేసులో నిలవనుంది. హోం గ్రౌండ్స్‌లో ఆడబోయే పాకిస్థాన్‌ నుంచి ప్రత్యర్థులకు సవాల్‌ తప్పదు. అంచనాలకు దొరకకుండా ప్రదర్శన చేయడంలో పాక్‌ ముందుంటుంది. పెద్ద టోర్నీల్లో ఆ జట్టును తక్కువగా భావించకూడదు’’ అని పాంటింగ్ వ్యాఖ్యానించాడు.

ఐసీసీ ఛాంపియన్స్‌ ట్రోఫీ 2025కి సమయం ఆసన్నమవుతోంది. ఫిబ్రవరి 19 నుంచి మార్చి 9 వరకు టోర్నీ జరగనుంది. ఈ టోర్నీలో మొత్తం 8 జట్లు పాల్గొననున్నాయి. వన్డే ప్రపంచకప్ 2023 పాయింట్ల పట్టికలో టాప్‌-8లో నిలిచిన 8 జట్లు ఇందులో పాల్గొంటున్నాయి.

ఛాంపియన్స్ ట్రోఫీ 2025 కోసం భారత జట్టు:

రోహిత్ శర్మ (కెప్టెన్‌), శుభ్‌మన్ గిల్‌ (వైస్ కెప్టెన్‌), విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్‌, కేఎల్ రాహుల్‌, అక్షర్‌ పటేల్‌, హార్దిక్ పాండ్యా, వాషింగ్టన్ సుందర్‌, కుల్‌దీప్ యాదవ్‌, జస్‌ప్రీత్ బుమ్రా, మహమ్మద్ షమీ, అర్షదీప్ సింగ్‌, యశస్వి జైశ్వాల్, రిషభ్ పంత్‌, రవీంద్ర జడేజా

భారత్ ఆడే మ్యాచ్‌ల షెడ్యూల్‌..

ఫిబ్రవరి 20న బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌

ఫిబ్రవరి 23న పాకిస్థాన్‌తో మ్యాచ్‌

మార్చి 2న న్యూజిలాండ్‌తో మ్యాచ్‌

Tags:    

Similar News