PBKS New Head Coach : పంజాబ్ కింగ్స్ హెడ్ కోచ్ గా రికీ పాంటింగ్ .. ప్రకటించిన మేనేజ్ మెంట్
ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ ( Ricky Ponting ) ఐపీఎల్ ఫ్రాంచైజీ పంజాబ్ కింగ్స్ హెడ్ కోచ్ గా నియమితులయ్యాడు. ఈ మేరకు బుధవారం పంజాబ్ ప్రకటన జారీ చేసింది. డిల్లీ క్యాపిటల్స్‌కు హెడ్ కోచ్‌గా పనిచేసిన రికీ పాంటింగ్‌ను ఆ టీమ్ తప్పించిన సంగతి తెలిసిందే. ట్రావిస్ బైలిస్ స్థానంలో రికీ బాధ్యతలు చేపడతాడు. తన నియామకంపై పాంటింగ్ స్పందించాడు. ‘పంజాబ్ కింగ్స్‌కు హెడ్ కోచ్‌గా రావడం ఆనందంగా ఉంది. కొత్త సవాళ్లను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నా. టీమ్ మేనేజ్ మెంట్ తో నాకు మంచి అనుబంధం ఉంది. తప్పకుండా ఫ్యాన్స్ కు కొత్త పంజాబ్ కింగ్స్ టీమ్‌ను చూపించేందుకు ప్రయత్నిస్తా’ అని వెల్లడించారు. ‘రికీ పాంటింగ్‌తో కలిసి పనిచేసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం. అతడి అనుభవం మాకెంతో ఉపయోగపడుతుంది. టీమ్ ను పవర్ ఫుల్ గా మార్చేందుకు రికీ శ్రమిస్తాడని భావిస్తున్నాం’ అని పంజాబ్ కింగ్స్ సీఈవో సతీశ్ మీనన్ చెప్పుకొచ్చాడు.