Rishabh Pant: మహేంద్రసింగ్ ధోని రికార్డును బ్రేక్ చేసిన పంత్..!
Rishabh Pant: టీంఇండియా మాజీ క్రికెటర్ ఎంఎస్ ధోని రికార్డును బ్రేక్ చేశాడు రిషబ్ పంత్.. అతి తక్కువ టెస్ట్ మ్యాచ్ లో 100 మందిని అవుట్ చేసిన భారత క్రికెటర్ గా చరిత్ర సృష్టించాడు.;
Rishabh Pant: టీంఇండియా మాజీ క్రికెటర్ ఎంఎస్ ధోని రికార్డును బ్రేక్ చేశాడు రిషబ్ పంత్.. అతి తక్కువ టెస్ట్ మ్యాచ్ లో 100 మందిని అవుట్ చేసిన భారత క్రికెటర్ గా చరిత్ర సృష్టించాడు. సెంచూరియన్‌లోని సూపర్‌స్పోర్ట్ పార్క్‌లో దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో 3వ రోజు పంత్ ఈ ఫీట్ సాధించాడు. . టెంబా బావుమాను ఔట్ చేయడంతో అతను ఈ ఘనతను అందుకున్నాడు పంత్. ధోని ఈ ఘనతను 36 టెస్టుల్లో సాధించగా, పంత్ కేవలం 26 టెస్టుల్లోనే సాధించాడు. దక్షిణాఫ్రికా వికెట్ కీపర్ క్వింటన్ డి కాక్ 22 టెస్టుల్లోనే 100 మందిని అవుట్ చేసి మొత్తం ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉన్నాడు.