Rohit Sharma : ఆ ముగ్గురూ ఫియర్ లెస్ క్రికెట్ ఆడుతారు : రోహిత్ శర్మ కామెంట్స్

Update: 2024-09-18 09:15 GMT

యశస్వి జైస్వాల్, జురుల్, సర్ఫారాజ్ ముగ్గురూ అద్భుతమై ప్లేయర్లు అని.. వారి గురించి ఎంత చెప్పుకున్న తక్కువేనని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తెలిపాడు. బంగ్లాదేశ్ తో టెస్ట్ సిరీస్ నేపథ్యంలో మీడియా సమావేశంలో పాల్గొన్న రోహిత్ శర్మ ఇలా కామెంట్స్ చేశాడు. ‘జైస్వాల్, జురుల్, సర్ఫరాజ్ ముగ్గురూ గ్రేట్ ప్లేయర్స్. వారి సత్తా ఏంటో ఇప్పటికే క్రికెట్ ప్రపంచానికి చూపించారు. ఈ యువ క్రికెటర్లకు మనం ఎక్కువగా సలహాలు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఆ ముగ్గురికి వారి రోల్స్ పై క్లారిటీ ఉంది. వాళ్లు ఫియర్ లెస్ క్రికెట్ ఆడుతున్నారు. జైస్వాల్ మాకు దొరికిన ఆణిముత్యం. ఓపెన‌ర్‌గా వ‌చ్చి మంచి స్టార్టింగ్ ను అందిస్తున్నాడు. ఇక జురెల్ కూడా వికెట్ల వెన‌క చాలా చురుగ్గా ఉన్నాడు. జురెల్ వికెట్ కీప‌ర్ గానే కాకుండా బ్యాట‌ర్‌గా కూడా త‌నను త‌ను నిరూపించుకున్నాడు. గత సిరీస్‌లో క్లిష్టమైన పరిస్థితుల్లో బ్యాటింగ్ కు వచ్చి టీమ్ కు విజయాన్ని అందించాడు. సర్ఫరాజ్ సైతం తొలి సిరీస్ తోనే ఆకట్టుకున్నాడు. వీరిందరికి మూడు ఫార్మాట్లలో ఆడే సత్తా ఉంది’ అని రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు.

Tags:    

Similar News