HCU: ముగిసిన షూటింగ్ చాంపియన్ షిప్ పోటీలు

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సీలో నిర్వహించిన షూటింగ్ చాంపియన్ షిప్ పోటీలు ముగిశాయి.;

Update: 2023-06-22 05:30 GMT

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సీలో నిర్వహించిన షూటింగ్ చాంపియన్ షిప్ పోటీలు ముగిశాయి. ఈ నెల 14 నుంచి ప్రారంభమైన ఈ పోటీలలో మూడువేల మందికి పైగా క్రీడాకారులు తమ ప్రతిభను కనబరిచారు. 10, 25, 50 మీటర్ల రేంజ్ లో నిర్వహించిన ఈ కాంపిటీషన్ లో విజేతలకు సీనియర్ ఐపీఎస్ అధికారి తరుణ్ జోషి మెడల్స్ ప్రదానం చేశారు. షూటింగ్ రేంజ్ లో యువకులు రాణించడం సంతోషంగా ఉందన్నారు తరుణ్ జోషి.ఈ క్రీడలో రాణించిన వారికి మంచి భవిష్యత్తు ఉంటుందని తెలిపారు.తెలంగాణ రైఫిల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పోటీల్లో క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొన్నారని చెప్పారు. ఈ పోటీల్లో విజయం సాధించిన వారు జోనల్ లెవల్ లో జరిగే పోటీల్లో పాల్గొనే అవకాశం ఉంటుందని తెలంగాణ రైఫిల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అమిత్ సంఘీ అన్నారు.

Tags:    

Similar News