IPL 2024 : శ్రేయస్ అయ్యర్ కష్టాలను దాటొచ్చి కప్ కొట్టాడు!

Update: 2024-05-27 04:10 GMT

ఐపీఎల్-2024 విజేతగా కేకేఆర్ నిలవడంలో ఆ జట్టు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కూడా కీలక పాత్ర పోషించారు. సీజన్ ప్రారంభానికి ముందు అతను చాలా క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొన్నారు. గాయం బారిన పడటం, టెస్ట్ జట్టులో స్థానం కోల్పోవడం, బీసీసీఐ కాంట్రాక్టు దక్కకపోవడం ఇలా వరుసగా ఎదురుదెబ్బలు తగిలాయి. అయినా వీటన్నింటిని అధిగమించి ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ సారథిగా, బ్యాటర్‌గా రాణించి తన జట్టును ఛాంపియన్‌గా నిలిపారు.

కోల్‌కతా నైట్‌రైడర్స్ ఖాతాలో మూడో ఐపీఎల్ ట్రోఫీ చేరింది. 2012, 2014లో గంభీర్ సారథ్యంలో టైటిల్ గెలుచుకున్న ఈ జట్టు, తాజాగా శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో గంభీర్ మెంటార్‌షిప్‌లో కప్పు నెగ్గింది. ఈ మెగా టోర్నీలో ముంబై ఇండియన్స్ (5), సీఎస్కే(5) తర్వాత అత్యధిక సార్లు ట్రోఫీని గెలుచుకున్న జట్టుగా కోల్‌కతా నైట్ రైడర్స్(3) నిలిచింది.

ఐపీఎల్- చరిత్రలో అత్యధిక సిక్సర్లు(1260) నమోదైన సీజన్‌గా 2024 నిలిచింది. అలాగే అత్యధిక రన్ రేట్(9.56), అత్యధిక 200+ స్కోర్లు (41), అత్యధిక సెంచరీలు(14), అత్యధిక స్కోర్ (287/3 SRH), ఛేజింగ్‌లో అత్యధిక స్కోర్ (262, PBKSvsKKR), T20 మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌లు కలిపి హైయెస్ట్ స్కోరు (549-SRHvsRCB) నమోదయ్యాయి. అలాగే త్వరగా పూర్తయిన ఫైనల్/నాకౌట్ మ్యాచ్‌గా (29overs) నిన్నటి ఫైనల్ మ్యాచ్ నిలిచింది.

Tags:    

Similar News