Shubhman Gill: 3వ స్థానంలో గిల్‌ని ఆడించడం తప్పిదమా..?
కొన్నేళ్లుగా 3వ స్థానంలో కొనసాగుతోన్న చటేశ్వర్ పూజారా;
విండీస్‌తో మొదటి టెస్ట్ బుధవారం ఆరంభమైంది. అయితే భారత ఓపెనర్‌గా ఇన్ని రోజులుగా ఉన్న రోహిత్, శుభ్ మన్ గిల్ జోడీ కాకుండా, ఐపిఎల్ సంచలనం యశస్వి జైశ్వాల్ రోహిత్‌తో జతకట్టాడు. శుభ్ మన్ గిల్‌ని 3వ స్థానంలో ఆడిస్తామని జట్టు యాజమాన్యం ప్రకటించింది.
మ్యాచ్‌కు ముందు రోహిత్ శర్మ మాట్లాడుతూ.. మూడవ స్థానంలో ఆడతానన్న నిర్ణయం గిల్‌దే అన్నాడు. ఆ స్థానంలో తాను ఇంతకుముందు బాగా ఆడానని కోచ్‌కి చెప్పడంతో ఈ నిర్ణయానికి వచ్చామని వెల్లడించాడు.
చాలా సంవత్సరాలుగా 3వ స్థానంలో ఉంటూ భారాన్ని మోసిన సీనియర్ బ్యాట్స్‌మెన్ ఛటేశ్వర్ పుజారాను టీంలోకి తీసుకోకపోవడంతో ఆ స్థానాన్ని ఎవరు భర్తీ చేయగలరో సందేహాలుండేవి. ఇప్పుడు గిల్‌ని ఆ స్థానంలో ఆడించాలన్న దీర్ఘకాలిక ప్రణాళికలో భాగంగానే ఈ నిర్ణయానికి వచ్చారు.
ఈ నిర్ణయం ఇప్పుడు బాగానే ఉన్నా పలు తప్పిదాలకు అవకాశమిచ్చే ఆస్కారం ఉండే అవకాశం ఉంది.
కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్లు ఫామ్ కోల్పోయి తంటాలు పడుతున్న సమయంలో ఓపెనర్‌గా వచ్చి తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. గత సంవత్సరం విండీస్‌తో సిరీస్‌లో రాణించి మ్యాన్ ఆఫ్ ది సిరీస్‌గా నిలిచాడు. IPLలో ఓపెనర్‌గా వచ్చిన గిల్ అత్యద్భుతమైన ఫాంతో ఆడి, అత్యధిక పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ హోల్డర్‌గా నిలిచాడు.
ఒపెనింగ్ జోడిగా లెఫ్ట్ హ్యాండ్, రైట్ హ్యాండ్ బ్యాట్స్‌మెన్ ఉండాలన్న ఉద్దేశ్యంతోనే గిల్‌ని అక్కడ ఆడిస్తున్నామని టీం చెబుతున్నా.. ఆ స్థానంలో అద్భుతంగా రాణించిన గిల్‌ని కింది స్థానంలోకి పంపడం ఆశ్చర్యకరమే.
ఓపెనర్‌గా సూపర్ ఫాంలో ఉన్న గిల్ 3వ స్థానంలోకి డిమోట్ కావడంతో ఆ స్థానంలో ఎంతవరకు రాణిస్తాడో ఇప్పుడే చెప్పలేం. ఈ స్థాన చలనం ఆటపై ప్రభావం చూపితే మొదటికే మోసం వస్తుంది. ఆ స్థానంలో విఫలయమైనా మళ్లీ అతడిని ఓపెనర్‌గా పంపే అవకాశాలు స్వల్పమే. ఎందుకంటే ఆ స్థానానికి భారత జట్టులో పోటీ చాలా ఎక్కువ. ఓపెనర్‌గా వచ్చిన జైశ్వాల్ ఆ స్థానంలో రాణించి స్థానం సుస్థిరం చేసుకుంటే గిల్‌కి గడ్డు పరిస్థితులు ఎదురుకావచ్చు.
పుజారా స్థానాన్ని భర్తీ చేయడానికే ఆ స్థానంలో ఆడిస్తున్నామని టీం చెబుతున్నా, అది దీర్ఘకాలిక ప్రణాళికలా అన్పించడం లేదు. పుజారా ఇప్పుడు టీంలో లేనంత మాత్రాన కెరీర్ ముగిసినట్లుగా ఎవరూ అనుకోవడం లేదు. ఒక వేళ పుజారా టీంలోకి వస్తే ఇద్దరి పరిస్థితి ఏంటన్నది ప్రశ్నార్థకమే. గాయం నుంచి కోలుకున్న శ్రేయస్ అయ్యర్, సీనియర్ ఆటగాడు రహానే, హనుమా విహారి వంటి ఆటగాళ్లు కూగా స్థిరంగా రాణిస్తుండటంతో జట్టు కూర్పు భారత కెప్టెన్, యాజమాన్యానికి సవాలే.
గిల్‌ని 3వ స్థానంలో విజయవంతం అయితే జట్టుకు అది కొండంత బలమే, కానీ విఫలం అయితే మాత్రం దుష్ప్రభావాలు తప్పకపోవచ్చు.