SMIRTHI-PALASH: మంధాన-పలాశ్ పెళ్లి రద్దు.. ఆగని ఊహాగానాలు
సాధించాల్సిన వాటిపై దృష్టి పెట్టండి: స్మృతీ మంధాన..
టీమిండియా మహిళా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన వివాహం రద్దైన విషయం తెలిసిందే. సంగీత దర్శకుడు పలాష్ ముచ్చల్‌ను నవంబర్ 23న స్మృతి వివాహం చేసుకోవాల్సి ఉండగా.. ఊహించని రీతిలో పెళ్లికి కొన్ని గంటల ముందు వాయిదా పడింది. స్మృతి తండ్రి శ్రీనివాస్ ఆరోగ్యం క్షీణించడంతో పెళ్లి వాయిదా పడిందని, పలాష్ కూడా అనారోగ్యానికి గురయ్యాడని, డిసెంబర్ 7న ఇద్దరి వివాహం జరగనుందని సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొట్టాయి. స్మృతి పలాష్‌తో పెళ్లి రద్దు చేసుకున్నట్లు ప్రకటించారు.
స్మృతి మంధాన తన పోస్ట్‌లో వివాహం ఎందుకు రద్దు అయిందో చెప్పలేదు. స్మృతి, పలాష్ వివాహం వాయిదా పడినప్పటి నుంచి కొన్ని షాకింగ్ విషయాలు చక్కర్లు కొట్టాయి. పలాష్ ఓ అమ్మాయితో చాటింగ్ చేసిన కొన్ని స్క్రీన్షాట్లు వైరల్ అయ్యాయి. ఇదే పెళ్లి రద్దుకు అసలు కారణమని న్యూస్ వచ్చింది. తాజాగా మరో షాకింగ్ న్యూస్ నెట్టింట వైరల్ అవుతోంది. సాంగ్లిలో వివాహానికి ముందు రోజు రాత్రి పలాష్ ఓ మహిళా క్రికెటర్‌కు రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయాడట. పెళ్లికి ముందు రోజు రాత్రి ఫామ్‌హౌస్‌లో స్మృతి తన స్నేహితులతో సరదాగా గడుపుతోంది. ఈ సమయంలో ఓ ఊహించని దృశ్యం క్రికెటర్ శ్రేయంకా పాటిల్ కంట పడిందట. కొరియోగ్రాఫర్ నందిక ద్వివేదితో పలాష్ సన్నిహితంగా ఉండడం శ్రేయంకా పాటిల్ చూశారట. శ్రేయంకా వెంటనే విషయం స్మృతి చెప్పారట. స్మృతి కూడా పలాష్, నందికలను అసహ్యకరమైన స్థితిలో చూశారట. స్మృతి సోదరుడు పలాష్‌ను కొట్టగా.. గొడవ జరిగిందట. ఇదంతా జరిగినప్పుడు అక్కడ చాలా తక్కువ మంది మాత్రమే ఉన్నారట. ఉదయం స్మృతి తండ్రి ఆరోగ్యం క్షీణించిందని, పెళ్లి వాయిదా పడిందని అందరికి చెప్పారన్న టాక్ నడుస్తోంది.
సాధించాల్సిన వాటిపై దృష్టి పెట్టండి: స్మృతీ మంధాన
భారత వైస్ కెప్టెన్ స్మృతి మంధాన జరిగిన విషయాలను మరచి పోవడానికి ప్రయత్నిస్తోంది. ఆటపై దృష్టి పెట్టేందుకు తనని తాను సంసిద్ధం చేసుకుంటోంది. ఈ క్రమంలోనే సంగీత స్వరకర్త పలాష్ ముచ్చల్‌తో తన వివాహం రద్దు అయిందని ధృవీకరించిన తర్వాత ఆమె మొదటిసారి మీడియా ముందు కనిపించింది. అమెజాన్ సంభవ్ సమ్మిట్‌లో మాట్లాడుతూ, 29 ఏళ్ల స్మృతి జీవితంలో అనుకోని పరిణామాలు సంభవించినప్పటికీ ఆట తనను సమతుల్యం చేస్తుందని చెప్పింది. జీవితం సంక్లిష్టంగా మారినప్పుడు తనను తాను నిలబెట్టుకోవడానికి క్రికెట్ ఎల్లప్పుడూ ఒక మార్గాన్ని అందిస్తుందని ఆమె అన్నారు.
ఏదైనా రంగంలో ఎవరైనా విజయం సాధించారంటే దాని వెనుక ఎంతో కష్టం ఉంటుంది. అది ఎవరికీ తెలియదు.. తెలియాల్సిన అవసరం కూడా లేదు. ఆ కష్టం పడే వాళ్లకి సంతృప్తిని ఇచ్చే రోజు ఒకటి ఉంటుంది. దాని కోసం ఎంతటి శ్రమ అయినా చేయాలి. స్థిరమైన కృషి మాత్రమే ఫలితాన్నిస్తుందని తెలిపింది. "నేను ఎప్పుడూ చాలా సాధారణ వ్యక్తిని, దేని గురించి అయినా ఎక్కువగా ఆలోచించడం ద్వారా నా జీవితాన్ని క్లిష్టతరం చేసుకోను. మీరు తెరవెనుక చాలా ఎక్కువగా పని చేస్తేనే, నమ్మకంగా బ్యాటింగ్‌కు వెళ్తారు" అని ఆమె క్రికెట్ క్రీడాకారులను ఉద్దేశించి చెప్పింది. నవంబర్ 2న నవీ ముంబైలోని డివై పాటిల్ స్టేడియంలో దక్షిణాఫ్రికాపై భారతదేశం సాధించిన చారిత్రాత్మక వన్డే ప్రపంచ కప్ విజయాన్ని మంధాన తిరిగి గుర్తుచేసుకుంది. సమిష్టి సంకల్పానికి గుర్తు ఆ క్షణం అని అభివర్ణించింది. తనకు క్రికెట్ కంటే మరేదీ ఇష్టమని అనుకోవడం లేదని వెల్లడించింది.