Mohammed Sham : బీసీసీఐకి సారీ .. మహ్మద్ షమీ పోస్టు వైరల్

Update: 2024-10-28 09:00 GMT

ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌కు ఎంపిక చేసిన జట్టులో మహ్మద్ షమీకి చోటు దక్కలేదు. గాయం తిరగబెట్టడంతో అతడిని పక్కనపెట్టింది. అయితే, నవంబర్ రెండో వారంలోగా ఫిట్‌నెస్‌ నిరూపించుకొంటే అవకాశం వస్తుందని క్రికెట్ వర్గాలు చెబుతున్నాయి. ఈ క్రమంలో షమీ సోషల్ మీడియా వేదికగా పెట్టిన పోస్టు వైరల్‌గా మారింది. 2023 వన్డే ప్రపంచ కప్‌ తర్వాత తన మోకాలికి శస్త్రచికిత్స చేయించుకున్న సంగతి తెలిసిందే. ఇటీవల దులీప్‌ ట్రోఫీ నాటికే సిద్ధమై ప్రాక్టీస్‌ చేసినప్పటికీ.. మోకాలిలో మళ్లీ వాపు కనిపించడంతో ఇబ్బంది పడ్డాడు. దీంతో న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌కు తీసుకోలేదు. ఇప్పుడు ఆసీస్‌ పర్యటనకూ ఎంపిక కాలేదు. ఈ క్రమంలో తన ఫిట్‌నెస్‌పై బీసీసీఐ, ఫ్యాన్స్‌కు సారీ చెప్పాడు.

Tags:    

Similar News