SRH vs LSG: ఉప్పల్ స్టేడియంలో పరుగుల సునామీ ,సన్రైజర్స్ ఘన విజయం

సిక్సర్లతో హోరెత్తించిన హెడ్, అభిషేక్..

Update: 2024-05-08 23:57 GMT

లక్నోతో జరిగిన మ్యాచ్ లో సన్ రైజర్స్ సూపర్ విక్టరీ సాధించింది.  166 పరుగుల విజయలక్ష్యాన్ని సన్ రైజర్స్ ఓపెనర్లు ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ ప్రచండ వేగంతో ఛేదించారు. ఈ లక్ష్యాన్ని కేవలం 9.4 ఓవర్లలోనే ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా ఛేదించి ఔరా అనిపించారు.1 ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా.. లక్నో బౌలర్లపై శివాలెత్తారు. ట్రావిస్ హెడ్ (89*), అభిషేక్ శర్మ (75*) పరుగులతో విరుచుకుపడ్డారు. కేవలం ఫోర్లు, సిక్సులతోనే లీడ్ చేశారు. ట్రావిస్ హెడ్ కేవలం 30 బంతుల్లోనే 89 పరుగులు చేశాడు. అతని ఇన్నింగ్స్ లో 8 ఫోర్లు, 8 సిక్సులు ఉన్నాయి. అటు అభిషేక్.. 28 బంతుల్లో 75 పరుగులు చేశాడు. అతని ఇన్నింగ్స్ లో 8 ఫోర్లు, 6 సిక్సులు ఉన్నాయి.

ముందుగా బ్యాటింగ్ చేసిన లక్నో.. కాస్త తడబడినప్పటికీ. హైదరాబాద్ బ్యాటర్లు మాత్రం భయం, బెదురు లేకుండా ఆకాశమే హద్దుగా చెలరేగారు. ఈ మ్యాచ్ లో విజయంతో సన్ రైజర్స్ ప్లే ఆఫ్ అవకాశాలను మరింత మెరుగుపరుచుకుంది. పాయింట్ల పట్టికలో ప్రస్తుతం ఎస్ఆర్హెచ్ మూడవ స్థానానికి ఎగబాకింది. కాగా.. లక్నో బౌలర్లు మాత్రం వికెట్లు తీయడంలో విఫలం కాగా.. ప్లే ఆఫ్ అవకాశాలు కొద్దిగా చేజారాయి.

అంతకుముందు బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్స్ 165 పరుగులు చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 165 పరుగులు చేసింది. లక్నో బ్యాటింగ్లో కేఎల్ రాహుల్ (29), క్వింటాన్ డికాక్ (2), మార్కస్ స్టోయినీస్ (3), కృనాల్ పాండ్యా (24), నికోలస్ పూరన్ (48*), ఆయుష్ బడోనీ (55*) పరుగులు చేశారు. హైదరాబాద్ బౌలింగ్లో భువనేశ్వర్ కుమార్ 2 వికెట్లు పడగొట్టగా.. ప్యాట్ కమిన్స్ ఒక వికెట్ తీశారు.

Tags:    

Similar News