Super Bowl 2022: ఆ ఆటను నేరుగా చూడడానికి ఒక్కో టికెట్ ధర రూ.7 లక్షలు..

Super Bowl 2022: క్రికెట్‌కు ఐపీఎల్ లాగానే ఫుట్‌బాల్‌లో సూపర్ బౌల్‌కు చాలా క్రేజ్ ఉంది.

Update: 2022-02-13 13:01 GMT

Super Bowl 2022: ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పొందిన గేమ్స్‌లో ఫుట్‌బాల్ కూడా ఒకటి. చాలామంది స్పోర్ట్స్ లవర్స్ ముందుగా ఫుట్‌బాల్‌ను నేర్చుకోవడానికే ఇష్టపడతారు. అయితే ఫుట్‌బాల్‌కు ఉన్న క్రేజ్ ఏంటో తెలియాలంటే ఎన్ఎఫ్ఎల్ నిర్వహించే అతిపెద్ద ఫుట్‌బాల్ లీగ్ అయిన సూపర్ బౌల్ టికెట్ ధరలు చూస్తే చాలు.. ఈ ధరతో అయిదుగురికి టికెట్ కొనడం అంటే ఓ మిడిల్ క్లాస్ వ్యక్తి ఇల్లు కట్టుకునే ఖర్చుతో సమానం.

క్రికెట్‌కు ఐపీఎల్ లాగానే ఫుట్‌బాల్‌లో సూపర్ బౌల్‌కు చాలా క్రేజ్ ఉంది. అమెరికాలో జరిగే ఆటల పోటీల్లో ఇదే రెండవ అతిపెద్ద పోటీ. సోమవారం నుండి లాస్ ఏంజిల్స్‌లో సూపర్ బౌల్ ప్రారంభం కానుంది. మామూలుగా సూపర్ బౌల్ చూడడానికి చాలామంది ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తారు. అందుకే దాని టికెట్ ధరలు ఎప్పుడూ ఆకాశాన్ని తాకుతాయి. కానీ ఈసారి రికార్డ్ స్థాయిలో టికెట్లు అమ్ముడుపోయాయి.

ముందుగా లాస్ ఏంజిల్స్ రామ్స్, సిసిన్నాటి బెంగాల్స్ మధ్య పోటీ జరగనుంది. అయితే దీనిని చూడడం కోసం ఒక్కొక్క టికెట్ ధర 10,427 డాలర్లుగా ఉంది.. అంటే ఇండియన్ కరెన్సీలో రూ. 7,85,658. మామూలుగా ఇప్పటివరకు ఒక్క టికెట్ ధర 9,800 డాలర్లు ఉండేది. ఈసారి రేట్లు అంత పెరిగినా కూడా ఫుట్‌బాల్ లవర్స్ ఎవరూ సూపర్ బౌల్ విషయంలో వెనక్కి తగ్గట్లేదు. పైగా సూపర్ బౌల్‌లో అతి తక్కువ ఉండే టికెట్ ధర 7000 డాలర్లు అంటే రూ.5,27,439. పైగా ఈ లీగ్ ప్రపంచంలోనే ఖరీదైన స్టేడియం అయిన 'సోఫీ స్టేడియం'లో జరుగుతుంది. అందుకే టికెట్ ధరలు కూడా అదే రేంజ్‌లో ఉంటాయన్నది ఫుట్‌బాల్ లవర్స్ వాదన.

Tags:    

Similar News