T20 WORLD CUP: అలెన్..విధ్వంసం సృష్టించెన్

టీ 20 ప్రపంచకప్ ఫైనల్‌కు కివీస్... విధ్వంసం సృష్టించిన ఫిన్ అలెన్.. 33 బంతుల్లోనే శతకం బాదిన ఫిన్

Update: 2026-03-05 03:00 GMT

క్రికెట్ అభిమానులను ఉర్రూతలూగించిన ఐసీసీ టీ20 వరల్డ్ కప్ తొలి సెమీఫైనల్‌లో న్యూజిలాండ్ జట్టు సంచలన విజయాన్ని నమోదు చేసింది. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన ఈ కీలక పోరులో దక్షిణాఫ్రికాను 9 వికెట్ల తేడాతో చిత్తు చేసి కివీస్ జట్టు ఘనంగా ఫైనల్‌కు దూసుకెళ్లింది. మ్యాచ్ మొత్తం మీద అన్ని విభాగాల్లో పూర్తి ఆధిపత్యం ప్రదర్శించిన న్యూజిలాండ్ ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా విజయం సాధించింది. ముఖ్యంగా ఓపెనర్ ఫిన్ అలెన్ ఆడిన తుఫాన్ ఇన్నింగ్స్ ఈ మ్యాచ్‌కు హైలైట్‌గా నిలిచింది. అతడు కేవలం 33 బంతుల్లోనే శతకం బాదుతూ టీ20 ప్రపంచకప్ చరిత్రలోనే అత్యంత వేగవంతమైన సెంచరీని నమోదు చేయడం ద్వారా మ్యాచ్‌ను ఏకపక్షంగా మార్చేశాడు.

ఈ కీలక మ్యా­చ్‌­లో టాస్ గె­లి­చిన న్యూ­జి­లాం­డ్ కె­ప్టె­న్ మి­చె­ల్ శాం­ట్న­ర్ ముం­దు­గా బౌ­లిం­గ్ ఎం­చు­కు­న్నా­డు. మొదట బ్యా­టిం­గ్‌­కు ది­గిన దక్షి­ణా­ఫ్రి­కా జట్టు ప్రా­రం­భం నుం­చే ఒత్తి­డి­లో పడిం­ది. కి­వీ­స్ బౌ­ల­ర్లు కట్టు­ది­ట్టం­గా బౌ­లిం­గ్ చే­య­డం­తో ప్రో­టీ­స్ బ్యా­ట­ర్లు పె­ద్ద­గా రా­ణిం­చ­లే­క­పో­యా­రు. ఒక దశలో దక్షి­ణా­ఫ్రి­కా జట్టు కే­వ­లం 77 పరు­గు­ల­కే ఐదు వి­కె­ట్లు కో­ల్పో­యి తీ­వ్ర ఇబ్బం­దు­ల్లో పడిం­ది. కీలక బ్యా­ట­ర్లు త్వ­ర­గా అవు­ట్ కా­వ­డం­తో జట్టు భారీ స్కో­రు సా­ధిం­చే అవ­కా­శా­లు తగ్గి­పో­యా­యి. ఈ సమ­యం­లో మా­ర్కో యా­న్స­న్ బా­ధ్యత తీ­సు­కు­ని జట్టు­ను ఆదు­కు­నే ప్ర­య­త్నం చే­శా­డు. అతడు అద్భు­తం­గా బ్యా­టిం­గ్ చే­స్తూ ప్ర­త్య­ర్థి బౌ­ల­ర్ల­పై దాడి కొ­న­సా­గిం­చా­డు. యా­న్స­న్ చి­వ­రి వరకూ క్రీ­జు­లో ని­లి­చి 55 పరు­గు­ల­తో నా­టౌ­ట్‌­గా ని­లి­చా­డు.

అతడి పోరాటం కారణంగా దక్షిణాఫ్రికా జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేయగలిగింది. ఒక దశలో 150 పరుగులు కూడా చేయడం కష్టంగా కనిపించిన పరిస్థితిలో యాన్సన్ ఇన్నింగ్స్ జట్టుకు గౌరవప్రదమైన స్కోరును అందించింది. న్యూజిలాండ్ బౌలర్లలో కోల్ మెక్కాన్చీ, రచిన్ రవీంద్ర, మ్యాట్ హెన్రీ అద్భుతంగా బౌలింగ్ చేశారు. వీరు ఒక్కొక్కరు రెండేసి వికెట్లు తీసి దక్షిణాఫ్రికా బ్యాటింగ్‌ను కట్టడి చేశారు. ముఖ్యంగా మధ్య ఓవర్లలో వీరి కట్టుదిట్టమైన బౌలింగ్ ప్రోటీస్ జట్టును ఒత్తిడిలోకి నెట్టింది. దీంతో దక్షిణాఫ్రికా పెద్ద స్కోరు చేయలేకపోయింది. 170 పరు­గుల లక్ష్యం­తో బ్యా­టిం­గ్‌­కు ది­గిన న్యూ­జి­లాం­డ్ జట్టు­కు ఓపె­న­ర్లు ఫిన్ అలె­న్, టిమ్ సీ­ఫె­ర్ట్ అద్భు­త­మైన ఆరం­భా­న్ని అం­దిం­చా­రు. ప్రా­రం­భం నుం­చే వీ­రి­ద్ద­రూ దక్షి­ణా­ఫ్రి­కా బౌ­ల­ర్ల­పై దా­డి­కి ది­గా­రు. పవ­ర్‌­ప్లే­లో­నే వీరు పరు­గుల వరద పా­రి­స్తూ మ్యా­చ్‌­ను పూ­ర్తి­గా తమ ఆధీ­నం­లో­కి తీ­సు­కు­వ­చ్చా­రు. కే­వ­లం ఆరు ఓవ­ర్ల­లో­నే 84 పరు­గు­లు చే­య­డం­తో కి­వీ­స్ వి­జ­యా­ని­కి పు­నా­ది పడి­పో­యిం­ది.

ముఖ్యంగా ఫిన్ అలెన్ ఆడిన ఇన్నింగ్స్ మ్యాచ్ గమనాన్ని పూర్తిగా మార్చేసింది. అతడు దక్షిణాఫ్రికా బౌలర్లను ఎలాంటి ఒత్తిడికి గురి కాకుండా ధాటిగా ఎదుర్కొన్నాడు. కేవలం 33 బంతుల్లోనే 10 ఫోర్లు, 8 సిక్సర్లతో అద్భుత శతకం సాధించాడు. టీ20 ప్రపంచకప్ చరిత్రలోనే అత్యంత వేగంగా నమోదైన ఈ సెంచరీ క్రికెట్ అభిమానులను ఆశ్చర్యపరిచింది. అలెన్ బ్యాటింగ్ ముందు సఫారీ బౌలర్లు పూర్తిగా తేలిపోయారు.

Tags:    

Similar News