T20 WORLD CUP: గ్రూప్ దశలో ఓ లెక్క.. నాకౌట్‌లో మరో లెక్క

టీమిండియా-ఇంగ్లాండ్ మధ్య సెమీస్ ఫైట్... అంచనాలను మించి రాణిస్తోన్న బ్రిటీష్ జట్టు... గ్రూప్ దశలో తేలిపోయిన ఇంగ్లాండ్ జట్టు

Update: 2026-03-03 11:00 GMT

కొ­న్నే­ళ్ల కిం­దట పరి­మిత ఓవ­ర్ల క్రి­కె­ట్‌­లో ఇం­గ్లాం­డ్‌ ప్ర­భం­జ­నం సృ­ష్టిం­చిం­ది. 2019 వన్డే ప్ర­పం­చ­క­ప్ గె­లి­చి తమ కలను నె­ర­వే­ర్చు­కు­న్న ఆ జట్టు, 2022లో రెం­డో­సా­రి టీ20 ప్ర­పం­చ­క­ప్‌­ను అం­దు­కుం­ది. దూ­కు­డు బ్యా­టిం­గ్‌, లో­తైన బ్యా­టిం­గ్‌ లై­న­ప్‌, బహు­ముఖ ఆల్‌­రౌం­డ­ర్లు, వే­గ­వం­త­మైన పే­స్‌ దళం—ఇవి ఆ జట్టు బలా­లు. కానీ గత రెం­డే­ళ్ల­లో ఆ ప్రా­భ­వం తగ్గిం­ది. భా­ర­త్‌ పర్య­ట­న­లో జరి­గిన అయి­దు మ్యా­చ్‌ల టీ20 సి­రీ­స్‌­లో 1-4తో పరా­జ­యం పా­ల­వ­డం పె­ద్ద దె­బ్బ­గా మా­రిం­ది. ఆ తర్వాత కె­ప్టె­న్‌­గా ఉన్న జోస్ బట్ల­ర్ పదవి నుం­చి తప్పు­కో­గా, యువ కె­ప్టె­న్‌ హ్య­రీ బ్రూ­క్ పగ్గా­లు చే­ప­ట్టా­డు. అప్ప­టి నుం­చి జట్టు­లో మా­ర్పు కని­పిం­చిం­ది. ఈ టో­ర్నీ ప్రా­రం­భం­లో మా­త్రం ఇం­గ్లాం­డ్‌ ప్ర­ద­ర్శన ఆశిం­చి­నం­త­గా లే­క­పో­యిం­ది. నే­పా­ల్‌ వంటి పసి­కూన జట్టు­పై కే­వ­లం నా­లు­గు పరు­గుల తే­డా­తో గట్టె­క్క­డం వి­మ­ర్శ­ల­కు దా­రి­తీ­సిం­ది. 180కి పైగా స్కో­రు చే­సి­న­ప్ప­టి­కీ దా­న్ని కా­పా­డు­కో­వ­డం­లో ఇబ్బం­దు­లు పడిం­ది. తర్వాత వె­స్టిం­డీ­స్‌ చే­తి­లో ఓటమి పా­ల­వ­డం­తో సె­మీ­స్‌ అవ­కా­శా­ల­పై అను­మా­నా­లు పె­రి­గా­యి. కానీ సూ­ప­ర్‌-8 దశ నుం­చి ఇం­గ్లాం­డ్‌ ఆట­తీ­రు పూ­ర్తి­గా మా­రి­పో­యిం­ది.

శ్రీ­లం­క­పై బౌ­లిం­గ్‌­కు అను­కూ­ల­మైన పి­చ్‌­పై 146 పరు­గు­లే చే­సి­నా, బౌ­ల­ర్ల సమి­ష్టి ప్ర­ద­ర్శ­న­తో ప్ర­త్య­ర్థి­ని 95 పరు­గు­ల­కే కట్ట­డి చే­సిం­ది. ఆ మ్యా­చ్‌­లో ఫిల్ సా­ల్ట్ కీలక ఇన్నిం­గ్స్‌­తో జట్టు­ను ని­ల­బె­ట్ట­గా, వి­ల్‌ జా­క్స్‌ పా­ర్ట్‌­టై­మ్‌ స్పి­న్‌­తో మ్యా­చ్‌­ను తా­రు­మా­రు చే­శా­డు. పా­కి­స్థా­న్‌­తో మ్యా­చ్‌­లో 58 పరు­గు­ల­కే నా­లు­గు వి­కె­ట్లు కో­ల్పో­యిన పరి­స్థి­తి­లో కె­ప్టె­న్‌ బ్రూ­క్‌ అద్భుత శత­కం­తో జట్టు­ను గట్టె­క్కిం­చా­డు. ఆ ఇన్నిం­గ్స్‌ అతని నా­య­క­త్వ సా­మ­ర్థ్యా­న్ని కూడా చా­టిం­ది. న్యూ­జి­లాం­డ్‌­పై లక్ష్య ఛే­ద­న­లో వి­ల్‌ జా­క్స్‌ ఆల్‌­రౌం­డ్‌ ప్ర­ద­ర్శన, టా­మ్‌ బాం­ట­న్‌ సహ­కా­రం ఇం­గ్లాం­డ్‌­ను గ్రూ­ప్‌­లో అగ్ర­స్థా­నా­ని­కి చే­ర్చా­యి.

ఇంగ్లాండ్‌ ఈ దశకు చేరడంలో ప్రధాన కారణం సమష్టితత్వం. ఏ ఒక్క ఆటగాడిపై ఆధారపడకుండా ప్రతి మ్యాచ్‌లో కొత్త హీరో బయటకు వస్తున్నాడు. విల్‌ జాక్స్‌ ఈ టోర్నీలో బ్యాటుతో 190కి పైగా పరుగులు చేయడమే కాక, బౌలింగ్‌లో కీలక వికెట్లు తీశాడు. స్పిన్‌ విభాగంలో ఆదిల్ రషీద్, లియామ్‌ డాసన్‌లు స్థిరత్వం చూపుతున్నారు. రషీద్‌ ఇప్పటికే పది పైగా వికెట్లు సాధించి ప్రత్యర్థి మధ్యక్రమాన్ని దెబ్బతీశాడు. పేస్‌ దళంలో జోఫ్రా ఆర్చర్, శామ్ కరణ్ జట్టుకు బలంగా నిలుస్తున్నారు. కరన్‌ బ్యాటుతో కీలక పరుగులు చేయడమే కాక, ఒత్తిడి సమయంలో బౌలింగ్‌లోనూ మెరవడం ఇంగ్లాండ్‌కు పెద్ద ప్లస్‌. జోస్‌ బట్లర్‌, జాకబ్‌ బెతెల్‌ వంటి ఆటగాళ్లు పూర్తి ఫామ్‌లో లేకపోయినా, మ్యాచ్‌ను ఒక్కసారిగా మలుపుతిప్పే సామర్థ్యం వాళ్లకు ఉంది. ముఖ్యంగా సాల్ట్‌ దూకుడు భారత బౌలర్లకు సవాల్‌గా మారవచ్చు. వీరిలో చాలా మందికి భారత్‌లో ఆడిన అనుభవం ఉంది. ఐపీఎల్‌లో ఆడి భారత పిచ్‌ల స్వభావాన్ని బాగా అర్థం చేసుకున్నారు. అందువల్ల సెమీఫైనల్‌ వేదికపై ఒత్తిడిని ఎలా ఎదుర్కోవాలో వారికి తెలుసు.

సెమీస్‌ జరగబోయే వాంఖడే స్టేడియం పిచ్‌ బ్యాటింగ్‌కు అనుకూలమైనదే అయినప్పటికీ, స్పిన్నర్లకు కూడా సహకరించే అవకాశం ఉంది. ఆ దృష్ట్యా ఇంగ్లాండ్‌ స్పిన్‌ దళం భారత బ్యాటర్లను పరీక్షించవచ్చు. ముఖ్యంగా అడిల్‌ రషీద్‌ లాంటి అనుభవజ్ఞుడిని తక్కువ అంచనా వేయడం ప్రమాదకరం. మరోవైపు ఆర్చర్‌ వేగం, కరన్‌ వైవిధ్యం భారత టాప్‌ ఆర్డర్‌కు సవాల్‌గా నిలవొచ్చు. టోర్నీ ప్రారంభంలో సందేహాల మధ్య ఉన్న ఇంగ్లాండ్‌ ఇప్పుడు పూర్తి స్థాయి పోటీదారుగా మారింది. దూకుడు, సమష్టి ప్రదర్శన, బహుముఖ ఆటగాళ్ల సమాహారంతో సెమీఫైనల్‌కు చేరింది.

Tags:    

Similar News