T20 WORLDCUP: గణాంకాల్లో మనమే ఘనం కానీ..

నేడు కరేబియన్లతో భారత్ అమీతుమీ... గణాంకాలన్నీ టీమిండియా వైపే.. 30 టీ 20ల్లో 20 విజయాలు మనవే

Update: 2026-03-01 04:15 GMT

టీ20 ప్ర­పం­చ­క­ప్ సూ­ప­ర్-8 దశ ఉత్కం­ఠ­భ­రి­తం­గా సా­గు­తోం­ది. ప్ర­తి మ్యా­చ్ సె­మీ­ఫై­న­ల్‌­కు దారి తీసే కీలక మలు­పు­గా మా­రు­తు­న్న ఈ సమ­యం­లో భారత జట్టు ముం­దు­న్న సవా­ల్ అత్యంత కీ­ల­కం. ఆది­వా­రం కో­ల్‌­క­తా­లో­ని చా­రి­త్రా­త్మక ఈడె­న్ గా­ర్డె­న్స్ వే­ది­క­గా భా­ర­త్, వె­స్టిం­డీ­స్ జట్లు తల­ప­డ­ను­న్నా­యి. ఇరు జట్ల­కూ ఇది డూ ఆర్ డై మ్యా­చ్. గె­లి­స్తే సె­మీ­స్ ఆశలు సజీ­వం, ఓడి­తే టో­ర్నీ­కి వీ­డ్కో­లు. అం­దు­కే ఈ పో­రు­ను క్రి­కె­ట్ అభి­మా­ను­లు క్వా­ర్ట­ర్ ఫై­న­ల్‌­గా అభి­వ­ర్ణి­స్తు­న్నా­రు. ఈ టో­ర్నీ­లో భా­ర­త్‌­కు సూ­ర్య­కు­మా­ర్ యా­ద­వ్ నా­య­క­త్వం వహి­స్తుం­డ­గా, కరే­బి­య­న్ జట్టు­ను షాయ్ హోప్ నడి­పి­స్తు­న్నా­రు. సూ­ప­ర్-8 దశలో భా­ర­త్ తొలి మ్యా­చ్‌­లో న్యూ­జి­లాం­డ్ చే­తి­లో ఓటమి పా­లైం­ది. అయి­తే జిం­బా­బ్వే­పై గె­లి­చి మళ్లీ రే­సు­లో­కి వచ్చిం­ది. అయి­న­ప్ప­టి­కీ రన్‌­రే­ట్ పరం­గా కొంత వె­ను­క­బ­డిన పరి­స్థి­తి నె­ల­కొం­ది. అం­దు­వ­ల్ల వె­స్టిం­డీ­స్‌­పై ఖచ్చి­త­మైన వి­జ­యం అవ­స­రం. అదే పరి­స్థి­తి వె­స్టిం­డీ­స్‌­కూ ఉంది. కా­బ­ట్టి ఇరు జట్లు పూ­ర్తి శక్తి­తో బరి­లో­కి ది­గ­ను­న్నా­యి.

టీ20 ఫా­ర్మా­ట్‌­లో భా­ర­త్‌­కు వె­స్టిం­డీ­స్‌­పై స్ప­ష్ట­మైన ఆధి­క్యం ఉంది. ఇప్ప­టి­వ­ర­కు ఇరు జట్లు 30 సా­ర్లు తల­ప­డ­గా, భా­ర­త్ 19 మ్యా­చ్‌­ల్లో గె­లి­చిం­ది. వె­స్టిం­డీ­స్ 10 మ్యా­చ్‌­ల్లో వి­జ­యం సా­ధిం­చిం­ది. ఒక మ్యా­చ్ ఫలి­తం లే­కుం­డా ము­గి­సిం­ది. స్వ­దే­శం­లో భా­ర­త్ 8 వి­జ­యా­లు సా­ధిం­చ­గా, వె­స్టిం­డీ­స్ గడ్డ­పై 5 మ్యా­చ్‌­ల్లో గె­లి­చిం­ది. తట­స్థ వే­ది­క­ల­పై కూడా భా­ర­త్‌­కు మె­రు­గైన రి­కా­ర్డు ఉంది. మరో­వై­పు కరే­బి­య­న్ జట్టు స్వ­దే­శం­లో 5, భారత గడ్డ­పై 2, తట­స్థ వే­ది­క­ల­పై 3 వి­జ­యా­లు సా­ధిం­చిం­ది. అయి­తే టీ20 ప్ర­పం­చ­క­ప్ టో­ర్నీ­ల్లో గణాం­కా­లు కొంత భి­న్నం­గా ఉన్నా­యి.

కరేబియన్ తో అంత తేలికం కాదు

ఇప్ప­టి­వ­ర­కు ఈ మెగా టో­ర్నీ­లో భా­ర­త్, వె­స్టిం­డీ­స్ నా­లు­గు సా­ర్లు ఎదు­రె­దు­ర­య్యా­యి. అం­దు­లో భా­ర­త్ ఒక్క మ్యా­చ్ మా­త్ర­మే గె­లి­చిం­ది. వె­స్టిం­డీ­స్ మూడు సా­ర్లు వి­జ­యం సా­ధిం­చిం­ది. భా­ర­త్ వె­స్టిం­డీ­స్‌­పై అత్య­ధి­కం­గా 192 పరు­గు­లు సా­ధిం­చ­గా, అత్య­ల్పం­గా 130 పరు­గు­లు చే­సిం­ది. కరే­బి­య­న్ జట్టు భా­ర­త్‌­పై అత్య­ధి­కం­గా 196 పరు­గు­లు, అత్య­ల్పం­గా 129 పరు­గు­లు నమో­దు చే­సిం­ది. ఈ గణాం­కా­లు మ్యా­చ్‌­పై మరింత ఆస­క్తి­ని పెం­చు­తు­న్నా­యి. ఈ మ్యా­చ్‌­కు వే­ది­కైన ఈడె­న్ గా­ర్డె­న్స్ పి­చ్‌­పై భారీ స్కో­ర్లు నమో­ద­య్యే అవ­కా­శం ఉంది. ఈ ప్ర­పం­చ­క­ప్‌­లో తొలి 200 పై­చి­లు­కు స్కో­రు కూడా ఇక్క­డే నమో­దైం­ది. స్కా­ట్లాం­డ్ ఇట­లీ­పై 207 పరు­గుల భారీ స్కో­రు చే­సిం­ది. అయి­తే అదే పి­చ్‌­పై ఇటలీ లక్ష్య ఛే­ద­న­లో 134 పరు­గు­ల­కే కు­ప్ప­కూ­లిం­ది. అంటే ఈ పిచ్ బ్యా­ట­ర్ల­కు మా­త్ర­మే కాదు, బౌ­ల­ర్ల­కు కూడా సహ­క­రి­స్తుం­ది. స్పి­న్న­ర్ల­కు టర్న్ లభి­స్తుం­డ­గా, పే­స­ర్ల­కు మంచి బౌ­న్స్ అం­దు­తోం­ది. మంచు ప్ర­భా­వం కూడా ఉండే అవ­కా­శం ఉంది. టాస్ గె­లి­చిన జట్టు రెం­డో ఇన్నిం­గ్స్‌­లో బౌ­లిం­గ్ చే­యా­లా, బ్యా­టిం­గ్ చే­యా­లా అన్న­ది వ్యూ­హా­త్మక ని­ర్ణ­యం కా­వ­చ్చు. బెం­గా­ల్ క్రి­కె­ట్ సంఘం అధ్య­క్షు­డు గం­గూ­లీ పి­చ్‌­ను పరి­శీ­లిం­చి సం­తృ­ప్తి వ్య­క్తం చే­సి­న­ట్లు సమా­చా­రం. పిచ్ క్యు­రే­ట­ర్ సు­జ­న్ ము­ఖ­ర్జీ కూడా సమ­తు­ల్య­మైన ఉప­రి­త­లం సి­ద్ధం చే­శా­మ­ని తె­లి­పా­రు. ఈ ప్ర­పం­చ­క­ప్‌­లో భా­ర­త్ ఈడె­న్ గా­ర్డె­న్స్‌­లో ఆడటం ఇదే మొ­ద­టి­సా­రి. గ్రూ­ప్ దశలో స్కా­ట్లాం­డ్, ఇట­లీ­ల­తో ఇక్క­డే రెం­డు మ్యా­చ్‌­లు ఆడిం­ది. ఆ అను­భ­వం వా­రి­కి కొంత ఉప­యో­గ­ప­డే అవ­కా­శం ఉంది.

Tags:    

Similar News