T20 WORLDCUP:టీమిండియా బ్యాటర్ల ఊచకోత
అర్ధ శతకం చేసి అవుటైన అభిషేక్ శర్మ
టీ20 ప్రపంచకప్ ఫైనల్లో భారత స్టార్ ఓపెనర్ అభిషేక్ శర్మ విధ్వంసం సృష్టించారు. కేవలం 18 బంతుల్లోనే హాఫ్ సెంచరీ సాధించారు. ఇందులో మూడు సిక్సులు, ఆరు ఫోర్లు ఉన్నాయి. మరోవైపు మరో ఓపెనర్ సంజూ శాంసన్ కూడా అదరగొడుతున్నారు. సంజూ సైతం కేవలం 30 బంతుల్లోనే 49 పరుగులు చేశారు. ఇందులో మూడు సిక్సులు, రెండు ఫోర్లు ఉన్నాయి.
బ్రాడ్‌కాస్టర్లపై నెటిజన్లు ఫైర్
టీ20 ప్రపంచకప్ 2026 ఫైనల్ ముగింపు వేడుకలో సాంకేతిక లోపం తలెత్తింది. ప్రపంచ ప్రఖ్యాత పాప్ స్టార్ రికీ మార్టిన్ ప్రదర్శన స్టార్ స్పోర్ట్స్, జియోస్టార్ ఫీడ్‌లో ఆయన గొంతు అస్పష్టంగా వినిపించింది. దీంతో బ్రాడ్‌కాస్టర్లు ప్రసారం చేసిన తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇంత పెద్ద ఈవెంట్‌లో అన్‌ప్రొఫెషనల్ వైఖరి ఏంటని నిలదీస్తున్నారు. పెద్ద అవమానం అంటూ BCCIను ట్యాగ్ చేస్తూ పోస్టులు పెడుతున్నారు
ఒకే ఓవర్‌లో 24 రన్స్
న్యూజిలాండ్‌తో జరుగుతున్న టీ20 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్‌లో భారత్‌కు ఒకే ఓవర్‌లో 24 పరుగులు వచ్చాయి. మూడో ఓవర్‌లో తొలుత అభిషేక్ శర్మ 4, 6 కొట్టగా.. తర్వాత సంజు శాంసన్ 6, 4 బాదాడు. ఈ ఓవర్లోనే 3 వైడ్లు, ఒక సింగిల్ వచ్చాయి. మొత్తంగా ఫెర్గ్యూసన్ బౌలింగ్‌లో 24 పరుగులు వచ్చాయి. ప్రస్తుతం భారత్ స్కోరు 10 ఓవర్లలోనే 1 వికెట్ నష్టానికి 128 పరుగులు చేసింది.