ఒలింపిక్ పరేడ్‌లో భారత్ అథ్లెట్లు ఉత్సాహంగా పాల్గొన్నారు. పీవీ సింధు, శరత్ కమల్ త్రివర్ణ పతాకం చేతబూని ముందు నిలబడగా.. వెనకాల భారత అథ్లెట్ల పడవ సాగింది.
సంప్రదాయ భారతీయ దుస్తుల్లో భారత అథ్లెట్లు మెరిసిపోయారు.
తెలుపు రంగుపై త్రివర్ణ పతాకంలోని మరో రెండు వర్ణాలతో రూపొందించిన చీరలను మహిళలు.. కుర్తా, పైజామాను పురుషులు ధరించారు. 78 మంది పరేడ్‌లో పాల్గొన్నారు.