TEAM INDIA: ఓటముల నుంచి పాఠాలు నేర్వని హెడ్ కోచ్
హెడ్ కోచ్‌గా విఫలమవుతున్న గంభీర్... కోచ్ గంభీర్ కెరీర్లోనే మాయని మచ్చ... మొన్న న్యూజిలాండ్ సిరీస్ వైట్ వాష్
భారత్ వర్సెస్ దక్షిణాఫ్రికా మధ్య జరిగిన మొదటి టెస్ట్ మ్యాచ్ కేవలం 3 రోజులు మాత్రమే పట్టింది. దక్షిణాఫ్రికా భారత్‌ను 30 పరుగుల తేడాతో ఓడించింది. భారత బ్యాట్స్‌మెన్స్ 124 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించడంలో విఫలమయ్యారు. దీంతో ఈ ఓటమి భారత జట్టుకు ఇబ్బందికరమైన రికార్డును సృష్టించింది. 124 పరుగుల లక్ష్యాన్ని ఛేదించిన భారత జట్టు కేవలం 93 పరుగులకే కుప్పకూలింది. దక్షిణాఫ్రికా 15 సంవత్సరాల తర్వాత భారత జట్టు తన తొలి టెస్ట్ విజయాన్ని నమోదు చేయడం ద్వారా చరిత్రను మార్చింది.
గంభీర్ చెత్త వ్యూహం
వైట్ బాల్ క్రికెట్‌ను పక్కన పెడితే, రెడ్ బాల్ ఫార్మాట్లో భారత జట్టు ఇటీవల కాలంలో తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొంటోంది. గత ఏడాది దేశీయ సిరీస్‌లో న్యూజిలాండ్ చేతిలో చిత్తుగా ఓడింది భారత్. తాజాగా కోల్‌కతా ఈడెన్ గార్డెన్స్‌లో సౌతాఫ్రికా భారత జట్టును 30 పరుగుల తేడాతో ఓడించింది. ఇది 15 ఏళ్ల తర్వాత సౌతాఫ్రికా భారత్‌ను తమ గడ్డకపై ఓడించి ప్రత్యేకత సాధించింది.టెంబా బవుమా నాయకత్వంలోని ఈ జట్టు, కీలక సందర్భాల్లో మెరుగ్గా ఆడింది. బ్యాటింగ్ ఆర్డర్ దెబ్బకొట్టడం, లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ల విఫలం కావడం, కెప్టెన్ శుభ్ మన్ గిల్ గాయం వంటి కారణాలు భారత జట్టు పరాజయానికి దారి తీశాయి. భారత జట్టులో అనుభవజ్ఞులు, ఫుల్‌టైమ్ స్పెషలిస్ట్ బ్యాటర్లు ఉన్నప్పటికీ బ్యాటింగ్ ఆర్డర్లో మార్పులతో ప్రయోగాలు చేయడం జట్టును దెబ్బకొట్టింది. జట్టు మేనేజ్మెంట్ వాషింగ్టన్ సుందర్‌ను మూడు నంబర్‌కు పంపే నిర్ణయం తీసుకుంది. సుందర్ పోరాడి తొలి ఇన్నింగ్స్‌లో 29 పరుగులు, రెండో ఇన్నింగ్స్‌లో 31 పరుగులు సాధించాడు.
మరీ ఇంత తికమక ఎందుకు.?
సౌతాఫ్రికాతో తొలి టెస్టు మ్యాచ్ కు ఫైనల్ లెవన్ ను చూసి చాలా మంది మాజీలు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేశారు! ఇదేం జట్టు కూర్పు అంటూ .. నివ్వెరపోయారు! వారి ఆశ్చర్యానికి తగ్గట్టుగానే ఫలితం వచ్చింది! అసలు వాషింగ్టన్ సుందర్ ను మూడో స్థానంలో పంపాలనే ఆలోచనకు హ్యాట్సాఫ్ చెప్పాలి! వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్.. ఇలా ఆల్ రౌండర్లు ఎక్కువైపోయి.. అటు బ్యాటింగ్ లోనూ ఇటు బౌలింగ్ లో కూడా తేడా కొడుతోంది! ఇద్దరు స్పిన్నర్లతో.. టీమిండియా స్వదేశంలో బోలెడన్ని టెస్టు మ్యాచ్ లను నెగ్గింది! అయితే ఇప్పుడు ముగ్గురు స్పిన్నర్లను జట్టులో కూర్చుకున్నా.. వరస ఓటములు తప్పడం లేదు! ఇక పిచ్ ల పరిస్థితి మరింత దయనీయంగా తయారైంది. సరిగ్గా కోవిడ్ సమయం నుంచి ఇండియా పిచ్ ల పరిస్థితి అత్యంత చెత్తగా మారింది. గత నాలుగైదేళ్లలో పోటాపోటీ పరిస్థితుల్లో ఐదో రోజు వరకూ జరిగిన టెస్టు ఒక్కటంటే ఒక్కటి లేదంటే.. ఈ పిచ్ లు టెస్టు క్రికెట్ ను చంపేయడానికే అని వేరే చెప్పనక్కర్లేదు! మరి అలాంటి పిచ్ లను తయారు చేసుకుని నెగ్గనైనా నెగ్గుతున్నారా.. అంటే, తను తీసుకున్న గోతిలో తనే పడ్డట్టుగా ఉంది టీమిండియా పరిస్థితి! రుడు న్యూజిలాండ్‌ను, ఇప్పుడు దక్షిణాఫ్రికాను భారత్‌కు తేలిగ్గా తీసుకుంది. కివీస్ అనుభవం తర్వాత కూడా భారత్.. సఫారీ స్పిన్నర్ల నుంచి ఎదురయ్యే ముప్పును గ్రహించలేకపోయింది. ఈ తప్పును కోచ్ గంభీర్ అంచనా వేయలేకపోయాడు.