TEAM INDIA: రో-కో, గంభీర్ల మధ్య దూరం..
రోహిత్-కోహ్లీ, గంభీర్ మధ్య పెరుగుతున్న అంతరం
టీమిండియా హెడ్ కోచ్ గంభీర్‌కు సీనియర్ ప్లేయర్లు రోహిత్, కోహ్లీ మధ్య అంతరం పెరుగుతోంది. వీళ్లిద్దరు టెస్టులకు దూరం అవడానికి కారణం గంభీరే అన్న వాదన బలంగా వినిపిస్తోంది. ఇప్పడు వన్డే జట్టులో సీనీయర్లు ఇద్దరూ ఉన్నా.. కోచ్ కు మాత్రం దూరంగానే ఉంటున్నారు. రో-కో 2027 వన్డే ప్రపంచకప్ ఆడనున్నారు. ఈ నేపథ్యంలో వీరికి, కోచ్‌కు మధ్య నెలకొన్న అంతరం తగ్గాల్సిందే. దీని కోసం బీసీసీఐ నేడు సమావేశం నిర్వహిస్తోంది.
దక్షిణాఫ్రికాతో రెండో వన్డే డిసెంబర్ 3న రాయ్‌పుర్‌లో జరుగనుంది. అయితే, ఈ మ్యాచ్‌కు ముందు టీమిండియా హెచ్ కోచ్ గౌతమ్ గంభీర్, చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్‌తో బీసీసీఐ ఆకస్మిక సమావేశం నిర్వహించే అవకాశముందని సమాచారం. టెస్టు జట్టు ప్రస్తుత ఫామ్, వ్యూహాలపై కీలక చర్చలు జరిగే అవకాశం ఉందని క్రికెట్ వర్గాలు చెబుతున్నాయి. 8 నెలల తర్వాత టెస్ట్ సిరీస్ ఉందని, అప్పటికి స్పష్టమైన ప్లాన్‌లో ఉండాలని బీసీసీఐ భావిస్తోందట. టెస్టు క్రికెట్లో ఇటీవల అనుసరిస్తున్న వ్యూహాలు, జట్టు ప్రదర్శనపై బీసీసీఐ ఆందోళన వ్యక్తం చేస్తోంది. రాబోయే 8 నెలల్లో తదుపరి టెస్టు సిరీస్ ఉన్న నేపథ్యంలో, ఇప్పటి నుంచే స్పష్టమైన ప్రణాళికలు రూపొందించాలని బోర్డు భావిస్తోంది.
లోపాలపైనే దృష్టి
సీనియర్ ఆటగాళ్లతో మేనేజ్మెంట్ వ్యవహరిస్తున్న తీరుపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించి, టెస్టుల నుంచి పక్కకు తప్పుకున్న వీరితో కమ్యూనికేషన్ గ్యాప్ ఉందని వార్తలు వస్తున్నాయి. దీనిపై స్పష్టత తీసుకోవడానికి ఈ సమావేశం కీలకం కానుంది. వచ్చే ఏడాది టీ20 ప్రపంచ కప్ టైటిల్ నిలబెట్టుకోవడం, ఆ తర్వాత వచ్చే వన్డే ప్రపంచ కప్ కోసం జట్టును సిద్ధం చేయడంపై బోర్డు దృష్టి పెట్టింది. మొత్తానికి, రాయ్‌పూర్‌లో జరగబోయే ఈ సమావేశం భారత క్రికెట్ జట్టు భవిష్యత్ దిశానిర్దేశం చేయడానికి, లోపాలు సరిదిద్దడానికి ఒక “స్ట్రక్చరల్ అలైన్మెంట్”గా భావిస్తున్నారు.