WTC: టీమ్‌ఇండియా ఆల్‌రౌండ్ ప్రదర్శనతో..అద్బుత ఆరంభం
అశ్విన్ స్పిన్ మాయాజాలంతో 130 పరుగులకే కుప్పకూలిన కరీబియన్ జట్టు..;
ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ సైకిల్‌లో భారత్‌కు అదిరే ఆరంభం లభించింది. డొమినికా వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన తొలి టెస్టులో టీమ్‌ఇండియా ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టడంతో మ్యాచ్ మూడ్రోజుల్లోనే ముగిసింది. 312 పరుగులు 2 వికెట్ల ఓవర్ నైట్ స్కోరుతో మూడో రోజు ఆటను ప్రారంభించిన భారత్.. 421పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. ఈ క్రమంలో తొలి ఇన్నింగ్స్‌లో 271 పరుగుల ఆధిక్యాన్ని సంపాదించింది. అనంతరం రెండో ఇన్నింగ్స్‌ను ఆరంభించిన కరీబియన్ జట్టు.. అశ్విన్ స్పిన్ మాయాజాలంతో 130 పరుగులకే కుప్పకూలింది. దీంతో భారత్ ఇన్నింగ్స్, 141 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. అరంగేట్రంలోనే శతకంతో ఆకట్టుకున్న యశస్వి జైస్వాల్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. రెండో టెస్టు జులై 20న మొదలుకానుంది.