ASHES: ఆసీస్ గడ్డపై ఇంగ్లండ్ ఘన విజయం

5,468 రోజుల తర్వాత గెలిచిన ఇంగ్లాండ్‌

Update: 2025-12-27 10:00 GMT

యా­షె­స్ సి­రీ­స్‌­లో భా­గం­గా ఆస్ట్రే­లి­యా-ఇం­గ్లం­డ్ మె­ల్‌­బో­ర్న్ వే­ది­క­గా నా­లు­గో టె­స్టు­లో తల­ప­డ్డా­యి. ఇప్ప­టి­కే మూడు టె­స్టు­ల్లో ఓడి.. సి­రీ­స్ కో­ల్పో­యిన ఇం­గ్లం­డ్ ఈ బా­క్సిం­గ్ డే టె­స్టు­లో 4 వి­కె­ట్లు తే­డా­తో ఘన వి­జ­యం సా­ధిం­చిం­ది. ఆస్ట్రే­లి­యా గడ్డ మీద దా­దా­పు 15 ఏళ్ల తర్వాత సు­దీ­ర్ఘ ఫా­ర్మా­ట్‌­లో ఇం­గ్లం­డ్ ఈ వి­జ­యం సా­ధిం­చ­డం గమ­నా­ర్హం. 175 పరు­గుల విజయ లక్ష్యం­తో బరి­లో­కి ది­గిన ఇం­గ్లం­డ్ 32.2 ఓవ­ర్ల­లో ఆరు వి­కె­ట్లు కో­ల్పో­యి 178 పరు­గు­లు చే­సిం­ది. ఇం­గ్లం­డ్ బ్యా­ట­ర్ల­లో క్రా­లీ(37), బెన్ డకె­ట్(34) జట్టు­కు శు­భా­రం­భా­న్ని అం­దిం­చా­రు. జా­క­బ్ బె­థె­ల్(40) రా­ణిం­చా­డు. బ్రై­డ­న్ కా­ర్స్(6), జో రూట్(15), బెన్ స్టో­క్స్(2) బ్యా­టిం­గ్‌­లో మరో­సా­రి వి­ఫ­ల­మ­య్యా­రు. హ్యా­రీ బ్రూ­క్(2*), జెమీ స్మి­త్(3*) నా­టౌ­ట్‌­గా ని­లి­చా­రు. ఆసీ­స్ బౌ­ల­ర్ల­లో స్కా­ట్ బో­లాం­డ్, రి­చ­ర్డ్‌­స­న్, మి­చె­ల్ స్టా­ర్క్ తలో రెం­డు వి­కె­ట్లు తీ­సు­కు­న్నా­రు.

 175 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ బరిలోకి దిగిన ఇంగ్లండ్ 32.2 ఓవర్లలో 6 వికెట్లకు 178 పరుగులు గెలుపొందింది. జాకోబ్ బెతెల్(46 బంతుల్లో 5 ఫోర్లతో 40), బెన్ డకెట్(26 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్‌తో 34), జాక్ క్రాలీ(48 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 37) టాప్ స్కోరర్లుగా నిలిచారు. ఆస్ట్రేలియా బౌలర్లలో మిచెల్ స్టార్క్, జై రిచర్డ్‌సన్, స్కాట్ బోలాండ్ రెండేసి వికెట్లు తీసారు. ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 34.3 ఓవర్లలో 132 పరుగులకు ఆలౌటైంది. ట్రావిస్ హెడ్(67 బంతుల్లో 4 ఫోర్లతో 46), స్టీవ్ స్మిత్(24 నాటౌట్), కామెరూన్ గ్రీన్(19) టాప్ స్కోరర్లుగా నిలవగా.. మిగతా బ్యాటర్లు సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. ఇందులో ముగ్గురు బ్యాటర్లు డకౌటయ్యారు.

Tags:    

Similar News