BCCI: భారత జట్టులో తెలుగమ్మాయి

Update: 2025-04-11 06:00 GMT

భారత మహిళ క్రికెట్ జట్టుకు తెలుగు తేజం శ్రీ చరణి సెలెక్ట్ అయ్యింది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ ఎన్.శ్రీ చరణికి జాతీయ జట్టు నుంచి పిలుపు వచ్చింది. ఈ నెల చివర్లో శ్రీలంకలో జరిగే ట్రై సిరీస్‌కు ప్రకటించిన భారత మహిళల జట్టులో ఆమెకు చోటు దక్కింది. భారత్, శ్రీలంక, సౌతాఫ్రికా మహిళల జట్ల మధ్య ఈ నెలలో చివర్లో వన్డే ట్రై సిరీస్ ప్రారంభంకానుంది. ఈ సిరీస్‌కు 15 మందితో కూడిన భారత జట్టును బీసీసీఐ మంగళవారం ప్రకటించింది. శ్రీచరణితోపాటు పేసర్ కాశ్వీ గౌతమ్, స్పిన్నర్ శుచి ఉపాధ్యాయ తొలిసారిగా జాతీయ జట్టులో చోటు సంపాదించారు. మరో తెలుగమ్మాయి అరుంధతి రెడ్డి తిరిగి వన్డే జట్టులోకి వచ్చింది. శ్రీచరణి భారత జట్టుకు ఎంపిక కావడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేశ్ హర్షం వ్యక్తం చేశారు. ' శ్రీ చరణి రాష్ట్రాన్ని గర్వపడేలా చేశారు. క్రికెట్‌లో ఆమె జర్నీ విజయవంతంగా కొనసాగాలని ఆకాంక్షిస్తున్న' అంటూ చంద్రబాబు ట్వీట్ చేశారు.


Tags:    

Similar News