పారాలింపిక్స్.. ఒకే ఈవెంట్లో భారత్‌కు స్వర్ణం, రజతం
పారాలింపిక్స్‌లో ఒకే ఈవెంట్లో మనీశ్ స్వర్ణం, అదానా రజతం సాధించారు. షూటింగ్‌లో 218.2 స్కోరు సాధించిన మనీశ్.. పారాలింపిక్స్ రికార్డు సృష్టించి స్వర్ణం అందుకున్నాడు.;
పారాలింపిక్స్‌లో ఒకే ఈవెంట్లో మనీశ్ స్వర్ణం, అదానా రజతం సాధించారు. షూటింగ్‌లో 218.2 స్కోరు సాధించిన మనీశ్.. పారాలింపిక్స్ రికార్డు సృష్టించి స్వర్ణం అందుకున్నాడు. 216.7 స్కోరుతో అదానా వెండి పతకం చేజిక్కించుకున్నాడు. పీ1 పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఎస్‌హెచ్1 పోటీల్లో మనీశ్, అదానా రెండు పతకాలు గెలుచుకున్నారు. ఎస్‌హెచ్1 పోటీల్లో ఒక కాలు, ఒక చేతి లేదా రెండు అవయవాల్లో వైకల్యం ఉన్నవారు పోటీపడతారు. అంటే కూర్చొని లేదా నిలబడి ఒకే చేత్తో పిస్టల్ పట్టుకొని షూట్ చేస్తారు. ఇప్పటికే షూటింగ్ విభాగంలో అవనీ లేఖరా ఒక స్వర్ణం, ఒక కాంస్యం గెలుచుకుంది.