Alyssa Healy: మహిళల క్రికెట్‌లో ముగిసిన ఓ శకం

క్రికెట్‌కు అలీసా హీలీ వీడ్కోలు... భారత్‌తో సిరీసే చివరిదన్న హీలీ... 16 ఏళ్ల పాటు సాగిన సుదీర్ఘ కెరీర్

Update: 2026-01-13 07:15 GMT

మహి­ళల క్రి­కె­ట్ చరి­త్ర­లో కొ­న్ని పే­ర్లు కే­వ­లం ఆట­గా­ళ్లు­గా మా­త్ర­మే కా­కుం­డా, ఒక యు­గా­ని­కి ప్ర­తీ­క­లు­గా ని­లి­చి­పో­తా­యి. ఆ జా­బి­తా­లో అగ్ర­స్థా­నం­లో ని­లి­చే పేరు అలీ­సా హీలీ. దూ­కు­డైన బ్యా­టిం­గ్, అద్భుత కీ­పిం­గ్, నా­య­క­త్వ లక్ష­ణా­లు.. ఈ మూ­డిం­టి సమ్మే­ళ­నం­గా ఆస్ట్రే­లి­యా మహి­ళల క్రి­కె­ట్‌­ను దశా­బ్ద­కా­లం­గా ముం­దు­కు నడి­పిం­చిన హీలీ, అం­త­ర్జా­తీయ క్రి­కె­ట్‌­కు వీ­డ్కో­లు పల­క­ను­న్న­ట్లు ప్ర­క­టిం­చిం­ది. భా­ర­త్‌­తో జర­గ­ను­న్న టె­స్ట్ సి­రీ­స్ తన కె­రీ­ర్‌­లో చి­వ­రి­ద­ని ఆమె వె­ల్ల­డిం­చ­డం­తో, మహి­ళల క్రి­కె­ట్ ప్ర­పం­చం ఒక్క­సా­రి­గా మూ­గ­బో­యిం­ది. 16 ఏళ్ల పాటు సా­గిన అద్భు­త­మైన అం­త­ర్జా­తీయ ప్ర­యా­ణా­ని­కి ఇదే సరైన ము­గిం­పు అని హీలీ చె­ప్పిన మా­ట­లు, క్రీ­డా­కా­రి­ణి­గా ఆమె పరి­ప­క్వ­త­ను చా­టు­తు­న్నా­యి. “ఇంకా ఆడ­గ­ల­నే­మో” అన్న భావన ఉన్నా, “ఇం­త­కా­లం నన్ను ముం­దు­కు నడి­పిం­చిన పోటీ తత్వం ఇప్పు­డు తగ్గిం­ద­ని” ని­జా­యి­తీ­గా ఒప్పు­కో­వ­డం... ది­గ్గ­జా­ల­కు మా­త్ర­మే సా­ధ్య­మ­య్యే ని­ర్ణ­యం ఇది. కొ­న్ని నె­ల­లు­గా రి­టై­ర్మెం­ట్‌­పై ఆలో­చి­స్తు­న్నా­న­ని, శా­రీ­ర­కం­గా–మా­న­సి­కం­గా అలసట పె­రి­గిం­ద­ని అలీ­సా హీలీ చె­ప్పిన మా­ట­లు అభి­మా­ను­ల­ను భా­వో­ద్వే­గా­ని­కి గురి చే­శా­యి.

హీలీ ఓ దిగ్గజం

2010లో టీ­నే­జ­ర్‌­గా ఆస్ట్రే­లి­యా మహి­ళల జట్టు­కు వి­కె­ట్‌­కీ­ప­ర్‌­గా అరం­గే­ట్రం చే­సిన హీలీ, అతి తక్కువ కా­లం­లో­నే జట్టు­లో కీలక ఆట­గా­ళ్ల­లో ఒక­రి­గా మా­రిం­ది. ఆ సమ­యం­లో మహి­ళల క్రి­కె­ట్‌­లో వి­కె­ట్‌­కీ­ప­ర్ పా­త్ర ఎక్కు­వ­గా “సపో­ర్టిం­గ్ క్యా­స్ట్”గానే భా­విం­చ­బ­డే­ది. కానీ హీలీ ఆ ని­ర్వ­చ­నా­న్నే మా­ర్చిం­ది. ఓపె­న­ర్‌­గా దూ­కు­డు­గా బ్యా­టిం­గ్ చే­స్తూ, మ్యా­చ్ ది­శ­ను తొలి పది ఓవ­ర్ల­లో­నే మా­ర్చ­గల ఆట­గా­ళ్ల­లో ఆమె ఒక­రి­గా ని­లి­చిం­ది. మెగ్ లా­నిం­గ్ నా­య­క­త్వం­లో­ని స్వ­ర్ణ­యు­గం­లో హీలీ చాలా కాలం వైస్ కె­ప్టె­న్‌­గా కీలక బా­ధ్య­త­లు ని­ర్వ­హిం­చిం­ది. 2023లో ఆమె­కు పూ­ర్తి స్థా­యి కె­ప్టె­న్సీ అప్ప­గిం­చి­న­ప్పు­డు, ఆస్ట్రే­లి­యా మహి­ళల క్రి­కె­ట్‌­లో ఒక సహ­జ­మైన మా­ర్పు కని­పిం­చిం­ది. కె­ప్టె­న్‌­గా ఆమె సా­ధిం­చిన ఘన­త­ల్లో ఇం­గ్లాం­డ్‌­పై 16-0తో సా­ధిం­చిన చా­రి­త్రక వై­ట్‌­వా­ష్ ప్ర­త్యే­కం­గా చె­ప్పు­కో­వా­లి. అది కే­వ­లం సి­రీ­స్ వి­జ­యం కాదు, ఆస్ట్రే­లి­యా ఆధి­ప­త్యా­ని­కి మరో ము­ద్ర.

ఎన్నో రికార్డులు

అలీ­సా హీలీ కె­రీ­ర్ గణాం­కా­లు ఆమె స్థా­యి­ని స్ప­ష్టం­గా వి­వ­రి­స్తా­యి. దా­దా­పు 300 అం­త­ర్జా­తీయ మ్యా­చ్‌­లు, అన్ని ఫా­ర్మా­ట్ల­లో కలి­పి 7,000కు పైగా పరు­గు­లు, మహి­ళల టీ20 అం­త­ర్జా­తీ­యా­ల్లో వి­కె­ట్‌­కీ­ప­ర్‌­గా అత్య­ధిక డి­స్మి­స­ల్స్ ఇవి సం­ఖ్య­లు మా­త్ర­మే. కానీ హీలీ ప్ర­భా­వం గణాం­కా­ల­కు అతీ­తం. వర­ల్డ్‌­క­ప్ ఫై­న­ల్‌­లో అత్య­ధిక వ్య­క్తి­గత స్కో­రు సా­ధిం­చిన ఆట­గా­ళ్ల­లో ఆమె ఒకరు. మొ­త్తం మీద ఆమె 8 ఐసీ­సీ వర­ల్డ్‌­క­ప్ వి­జేత జట్ల­లో సభ్యు­రా­లి­గా ని­ల­వ­డం, ఆస్ట్రే­లి­యా మహి­ళల క్రి­కె­ట్ ఎంత స్థి­రం­గా, శక్తి­వం­తం­గా కొ­న­సా­గిం­దో సూ­చి­స్తుం­ది. 2019లో ఆమె­కు లభిం­చిన ప్ర­తి­ష్టా­త్మక బె­లిం­డా క్లా­ర్క్ అవా­ర్డు, రెం­డు సా­ర్లు ఐసీ­సీ మహి­ళల టీ20 క్రి­కె­ట­ర్ ఆఫ్ ది ఇయర్ అవా­ర్డు­లు... ఈ గౌ­ర­వా­లు ఆమె గొ­ప్ప­త­నా­ని­కి అధి­కా­రిక ము­ద్ర­లు. హీలీ రి­టై­ర్మెం­ట్ ప్ర­క­ట­న­లో అత్యంత ప్ర­భా­వ­వం­త­మైన అంశం ఆమె ని­జా­యి­తీ. “గత కొ­న్ని సం­వ­త్స­రా­లు శా­రీ­ర­కం­గా, మా­న­సి­కం­గా చాలా అల­సి­పో­యా­ను. గా­యా­లు కూడా ఇబ్బం­ది పె­ట్టా­యి. ఇం­త­కు ముం­దు లాగ ఆ శక్తి­ని తి­రి­గి తె­చ్చు­కో­వ­డం ఇప్పు­డు కష్టం­గా మా­రిం­ది” అని అలీ­సా హీలీ చె­ప్పిన మా­ట­లు, నేటి ప్రొ­ఫె­ష­న­ల్ క్రి­కె­ట్ ఎంత కఠి­న­మైం­దో తె­లి­య­జే­స్తా­యి.

Tags:    

Similar News