Tokyo Paralympics: కోచ్‌ లేకుండానే పతకం గెలిచా - యోగేశ్‌ కతునియా

Tokyo Paralympics: టోక్యో పారాలింపిక్స్‌లో కోచ్‌ లేకుండానే పతకం గెలిచాడు భారత అథ్లెట్‌ యోగేశ్‌ కతునియా.

Update: 2021-08-30 13:15 GMT

Tokyo Paralympics: టోక్యో పారాలింపిక్స్‌లో కోచ్‌ లేకుండానే పతకం గెలిచాడు భారత అథ్లెట్‌ యోగేశ్‌ కతునియా. ఏడాదిగా కోచ్‌ లేకుండానే కఠిన సాధన చేశానాని అతడు తెలిపాడు. ప్యారిస్‌ పారాలింపిక్స్‌లో కచ్చితంగా స్వర్ణం గెలుస్తానని కతునియా ధీమా వ్యక్తం చేశాడు.

దిల్లీలోని కిరోరిమల్‌ కళాశాలలో బీకామ్‌ చదివిన 24 ఏళ్ల కతునియా టోక్యో పారాలింపిక్స్‌ డిస్కస్‌ త్రోలో రజతం గెలిచిన సంగతి తెలిసిందే. అతడు డిస్క్‌ను 44 మీటర్లు విసిరి పతకం గెలిచాడు. ఆఖరి దఫా అయినా ఆరోసారి అతడీ ఘనత అందుకోవడం విశేషం. ఐతే కోచ్‌ లేకుండానే అతడు ఈ రికార్డు సృష్టించడం అందరినీ ఆశ్చర్యపరిచింది.

Tags:    

Similar News