TENNIS: టెన్నీస్ చరిత్రలో భారత ఘన కీర్తి

అద్భుతం చేసిన 14 ఏళ్ల జెన్సీ కానాబార్... అండర్-14 ఆస్ట్రేలియన్ ఓపెన్ కైవసం.. తొలి భారత క్రీడాకారిణిగా గుర్తింపు

Update: 2026-01-31 09:45 GMT

భారత టె­న్ని­స్ భవి­ష్య­త్‌­కు శు­భా­రం­భం పలు­కు­తూ, జె­న్సీ కా­నా­బా­ర్ అనే చి­న్నా­రి ఆస్ట్రే­లి­య­న్ ఓపె­న్ అం­డ­ర్-14 టై­టి­ల్‌­ను కై­వ­సం చే­సు­కుం­ది. ఒత్తి­డి పరి­స్థి­తు­ల్లో అసా­ధా­రణ పో­రాట పటి­మ­ను కన­బ­రి­చి, అం­త­ర్జా­తీయ వే­ది­క­పై భారత జెం­డా­ను ఎగ­ర­వే­సిం­ది.

నవ శకం ఆరంభం

భారత టె­న్ని­స్ చరి­త్ర­లో మరో స్వ­ర్ణ అధ్యా­యం నమో­దైం­ది. కే­వ­లం 14 ఏళ్ల వయ­సు­లో­నే భారత యువ టె­న్ని­స్ సం­చ­ల­నం జె­న్సీ కా­నా­బా­ర్ అం­త­ర్జా­తీయ వే­ది­క­పై సరి­కొ­త్త రి­కా­ర్డు సృ­ష్టిం­చిం­ది. ఆస్ట్రే­లి­యా గడ్డ­పై ప్ర­తి­ష్ఠా­త్మ­కం­గా జరి­గిన ఆస్ట్రే­లి­య­న్ ఓపె­న్ అం­డ­ర్-14 వి­భా­గం­లో వి­జే­త­గా ని­లి­చి, ఈ ఘనత సా­ధిం­చిన తొలి భా­ర­తీయ మహి­ళా క్రీ­డా­కా­రి­ణి­గా చరి­త్ర­లో ని­లి­చిం­ది. ఈ వి­జ­యం­తో భారత క్రీ­డా ప్ర­పం­చం మొ­త్తం గర్వం­తో తలె­త్తు­కుం­ది. మె­ల్‌­బో­ర్న్లో జరి­గిన ఫై­న­ల్ పోరు ప్రే­క్ష­కు­ల­ను ఉత్కం­ఠ­కు గు­రి­చే­సిం­ది. ఆస్ట్రే­లి­యా­కు చెం­దిన ము­సె­మ్మా కి­లె­క్‌­తో జరి­గిన తుది సమ­రం­లో జె­న్సీ ఆరం­భం­లో­నే తీ­వ్ర ఒత్తి­డి­ని ఎదు­ర్కొం­ది. తొలి సె­ట్‌­ను 3-6తో కో­ల్పో­యిన ఆమె, రెం­డో సె­ట్‌­లో కూడా 0-2తో వె­ను­క­బ­డి ఓటమి అం­చున ని­లి­చిం­ది. అయి­తే ఆ కీలక సమ­యం­లో అసా­ధా­రణ ఆత్మ­స్థై­ర్యం ప్ర­ద­ర్శిం­చిన జె­న్సీ, ఆట తీ­రు­ను పూ­ర్తి­గా మా­ర్చిం­ది. ప్ర­తి పా­యిం­ట్ కోసం పట్టు­ద­ల­తో పో­రా­డిన జె­న్సీ, ప్ర­త్య­ర్థి ఆటను అం­చ­నా వేసి వ్యూ­హా­త్మ­కం­గా దె­బ్బ­కొ­ట్టిం­ది. రెం­డో సె­ట్‌­ను 6-4తో సొం­తం చే­సు­కు­ని మ్యా­చ్‌­లో­కి తి­రి­గి వచ్చిన ఆమె, ని­ర్ణా­యక సె­ట్‌­లో ప్ర­త్య­ర్థి­కి ఎలాం­టి అవ­కా­శం ఇవ్వ­లే­దు. 6-1 స్కో­రు­తో సె­ట్‌­ను ము­గిం­చి, అద్భుత వి­జ­యం సా­ధి­స్తూ టై­టి­ల్‌­ను తన ఖా­తా­లో వే­సు­కుం­ది. ఓటమి అంచు నుం­చి వి­జ­యం వరకూ సా­గిన ఈ ప్ర­యా­ణం జె­న్సీ పో­రాట పటి­మ­కు ప్ర­తీ­క­గా ని­లి­చిం­ది. జెన్సీపై ప్రశంసల జల్లు కురుస్తోంది.

భవిష్యత్తుపై భారీ ఆశలు

గత ఏడా­ది బా­లుర వి­భా­గం­లో భారత యువ ఆట­గా­డు అర్ణ­వ్ పా­ప­ర్క­ర్ ఈ టై­టి­ల్‌­ను గె­లు­చు­కో­గా, ఇప్పు­డు బా­లి­కల వి­భా­గం­లో జె­న్సీ అదే ఘన­త­ను సా­ధిం­చ­డం వి­శే­షం. దీం­తో ఆస్ట్రే­లి­య­న్ ఓపె­న్ అం­డ­ర్-14 వి­భా­గం­లో భారత టె­న్ని­స్ ఆధి­ప­త్యం మరింత బల­ప­డి­న­ట్లు క్రీ­డా వర్గా­లు భా­వి­స్తు­న్నా­యి. గు­జ­రా­త్ రా­ష్ట్రం­లో­ని జు­నా­గ­ఢ్‌­కు చెం­దిన జె­న్సీ కా­నా­బా­ర్ చి­న్న వయ­సు­లో­నే టె­న్ని­స్‌­పై అసా­ధా­రణ ప్ర­తిభ కన­బ­రి­చిం­ది. దే­శీయ స్థా­యి­లో ఆమె ఇప్ప­టి­కే ఆల్ ఇం­డి­యా టె­న్ని­స్ అసో­సి­యే­ష­న్ (AITA) అం­డ­ర్-14, అం­డ­ర్-16 వి­భా­గా­ల్లో నెం­బ­ర్ వన్ ర్యాం­కు­ను సొం­తం చే­సు­కు­ని తన సత్తా చా­టిం­ది. దే­శీయ టో­ర్నీ­ల్లో ని­ల­క­డైన ప్ర­ద­ర్శ­న­తో ని­పు­ణుల దృ­ష్టి­ని ఆక­ర్షిం­చిన జె­న్సీ, అం­త­ర్జా­తీయ స్థా­యి­లో­నూ అదే స్థా­యి­లో ప్ర­తి­భ­ను కొ­న­సా­గి­స్తోం­ది.

Tags:    

Similar News