IPL auction: IPL వేలంలో అనుకోని సంఘటన.. కుప్పకూలిన ఆక్షనీర్
IPL auction: వేలం తిరిగి మధ్యాహ్నం మూడున్నర గంటలకు ప్రారంభం అవుతుందని బిసిసిఐ తెలిపింది.;
IPL auction: ఐపీఎల్ వేలం 2022 బెంగళూరు వేదికగా జరుగుతోంది.. వేలంలో పాల్గొంటున్న సభ్యులు ఆక్షన్‌లో పాల్గొనేందుకు సిద్ధంగా ఉన్నారు.. ఒక పక్క ఆక్షనీర్ వేలంపాట నిర్వహిస్తున్నారు.. కానీ అంతలోనే ఉన్నట్టుండి ఆక్షనీర్ ఎడ్మెడేస్ కిందపడిపోయారు.. సీరియస్‌గా జరుగుతున్న ఆక్షన్‌లో బ్రేక్ పడింది.
అక్కడున్న వారంతా షాక్‌కి గురయ్యారు. శ్రీలంక ఆల్‌రౌండర్ వనిందు హసరంగ కోసంపంజాబ్ కింగ్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు పోటీపడుతున్న సమయంలో ఈ ఘటన జరిగింది. దీంతో వేలం నిలిపివేశారు.
ఎడ్మెడేస్‌ని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. అతడి ఆరోగ్యం నిలకడగా ఉందని, తిరిగి వేలంలో పాల్గొంటారని బిసిసిఐ వివరించింది. క్రికెట్ ప్రజెంటర్ గౌతమ్ భీమాని ఎడ్మెడేస్ ఆరోగ్యంగా ఉన్నారని తెలిపాడు. ఆయనకు ఎటువంటి అనారోగ్య సమస్యలు లేవని అన్నాడు. వేలం తిరిగి మధ్యాహ్నం మూడున్నర గంటలకు ప్రారంభం అవుతుందని బిసిసిఐ తెలిపింది.