IPL: చరిత్ర సృష్టించిన వైభవ్ సూర్యవంశీ

తొలి మ్యాచులో ఏడ్చి ఈ మ్యాచులో శతకంతో నవ్వాడు... వైభవ్ పై ప్రశంసల జల్లు;

Update: 2025-04-29 02:30 GMT

పట్టుమని 15 ఏళ్లు కూడా లేని కుర్రాడు.. ఐపీఎల్‌లో చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్ 2025లో ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన భారత ప్లేయర్‌గా నిలిచాడు. అంతేకాదు, చిన్న వయస్సులో సెంచరీ చేసిన బ్యాటర్‌గా రికార్డు సృష్టించాడు. రాజస్థాన్ రాయల్స్, గుజరాత్ టైటాన్స్‌ మధ్య జరిగిన మ్యాచ్‌లో 35 బంతుల్లోనే వైభవ్ సూర్యవంశీ అద్భుత శతకం చేశాడు. దీంతో క్రిస్‌ గేల్ తర్వాత ఐపీఎల్‌లో ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన ఆటగాడిగా వైభవ్ సూర్యవంశీ నిలిచాడు. వైభవ్ ఐపీఎల్ లో తన తొలి మ్యాచును లక్నో సూపర్ జెయింట్స్‌‌తో ఆడి.. 20 బంతుల్లో రెండు ఫోర్లు, మూడు సిక్సర్లతో 34 పరుగులు చేశాడు. అరంగేట్ర మ్యాచులో ఆడిన తొలి బంతికే సిక్స్ బాది అదరగొట్టాడు. అయితే ఈ మ్యాచ్‌లో స్టంపవుట్ అయిన వైభవ్.. పెవిలియన్ చేరే సమయంలో ఏడ్చుకుంటూ వెళ్లడం అందరినీ మనసులను తాకిన విషయం తెలిసిందే. కానీ గుజరాత్‌ టైటాన్స్‌తో నేడు జరిగిన మ్యాచ్‌లో మాత్రం తనలోని కసిని, సత్తాను మైదానంలో సెంచరీ బాది చూపించాడు.

సునామీ సృష్టించాడు

గుజరాత్‌తో జరిగిన ఈ మ్యాచులో వైభవ్ సూర్యవంశీ కనీవినీ ఎరుగని రీతిలో విధ్వంసం సృష్టించాడు. హేమాహేమీ బౌలర్లను సైతం ఉతికారేస్తూ.. ఐపీఎల్‌ చరిత్రలోనే రెండో ఫాస్టెస్ట్‌ సెంచరీని నమోదు చేశాడు. ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలిచాడు. గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో వైభవ్ ఈ ఫీట్ సాధించాడు. ఐపీఎల్‌లో అడుగుపెట్టిన వైభవ్ లక్నో సూపర్ జెయింట్స్‌‌తో తొలి మ్యాచ్ ఆడగా.. 20 బంతుల్లో రెండు ఫోర్లు, మూడు సిక్సర్లతో 34 పరుగులు చేశాడు.

రాయల్స్ విజయం

వరుస ఓటములతో సతమతమవుతున్న రాజస్థాన్ రాయల్స్‌కు వైభవ్ సూర్యవంశీ విజయాన్ని అందించాడు. తుపాను ఇన్నింగ్స్‌తో గుజరాత్‌ టైటాన్స్‌కు దిమ్మతిరిగే షాక్ ఇచ్చాడు. మూడు మ్యాచ్ ల్లో చేజింగ్ లో విఫ‌ల‌మైన రాజస్థాన్‌.. గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో మాత్రం రెచ్చిపోయింది. జైపూర్‌లో జ‌రిగిన ఈ మ్యాచ్ లో వైభ‌వ్ సూర్యవంశీ ఈ సీజన్‌లో ఫాస్టెస్ట్ సెంచ‌రీ నమోదు చేయడంతో రాజస్థాన్ ఎనిమిది వికెట్లతో ఘ‌న విజ‌యం సాధించింది. ఫ‌స్ట్ బ్యాటింగ్ చేసిన గుజ‌రాత్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 4 వికెట్లకు 209 ప‌రుగులు చేసింది. శుభ‌్‌మన్ గిల్ కెప్టెన్ ఇన్నింగ్స్ (50 బంతుల్లో 84, 5 ఫోర్లు, 4 సిక్స‌రలు) తో టాప్ స్కోర‌ర్ గా నిలిచాడు. అనంత‌రం సూర్యవంశీ శతక గర్జనతో రాయల్స్ కేవ‌లం 15.5 ఓవ‌ర్ల‌లో 2 వికెట్ల‌కు 212 ప‌రుగులు చేసి విజ‌యం సాధించింది.

Tags:    

Similar News