భారత రెజ్లర్ వినేశ్ ఫొగట్ ( Vinesh Phogat ) సంచలన నిర్ణయం తీసుకున్నారు. రెజ్లింగ్‌కు రిటైర్మెంట్ ప్రకటిస్తున్నట్లు ఆమె ట్వీట్ చేశారు. ‘నాపై రెజ్లింగ్ గెలిచింది. నేను ఓడిపోయాను. నా ధైర్యం ఓడిపోయింది. నాకు ఇంక బలం లేదు. గుడ్ బై రెజ్లింగ్ 2001-2024’ అని ఎమోషనల్ పోస్ట్ చేశారు. కాగా అధిక బరువు కారణంగా ఫొగట్ ఫైనల్‌కు అర్హత సాధించలేకపోయారు. దీంతో చివరి క్షణంలో ఆమె పతకం గెలిచే అవకాశం కోల్పోయారు. మరోవైపు ఫొగాట్ తనను అనర్హురాలిగా ప్రకటించడాన్ని సవాల్ చేస్తూ.. కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్‌ను ఆశ్రయించిన సంగతి తెలిసిందే. తను సిల్వర్ మెడల్‌కు అర్హురాలినని ఫిర్యాదులో పేర్కొన్నట్లు తెలుస్తోంది. దీనిపై ఆ ఆర్భిట్రేషన్ తీర్పు వెల్లడించాల్సి ఉండగా.. ఇంతలోనే వినేశ్ ఈ నిర్ణయం తీసుకున్నారు.