విరాట్ కోహ్లీ ఢిల్లీ తరఫున రంజీ మ్యాచ్ ఆడుతున్నారు. రంజీలు ఆడితే కోహ్లీకి రోజుకు రూ.60,000 జీతం అందుకోనున్నారు. మ్యాచ్ జరిగే 4 రోజులకు కలిపి రూ.2.40 లక్షలు పారితోషికం తీసుకుంటారు. రంజీల్లో 40 మ్యాచులకు పైగా ఆడితే రోజుకు రూ.60వేలు, 21-40 మ్యాచులకు రూ.50వేలు, 20 కంటే తక్కువ ఆడితే రూ.40వేలు, ఆరంగేట్ర ఆటగాడికి రూ.20 వేల నుంచి రూ.30 వేల వరకు ఇస్తారు.
స్వతంత్ర భారతదేశానికి ముందు నుంచి భారతదేశంలో రంజీ ట్రోఫీ ఆడుతున్నారు. భారతదేశం బ్రిటిష్ పాలనలో ఉన్నప్పుడు, నవనగర్ (ప్రస్తుతం జామ్‌నగర్) రాష్ట్రానికి చెందిన మహారాజా రంజిత్ 1896, 1902 మధ్య ఇంగ్లండ్ తరపున 15 టెస్ట్ మ్యాచ్‌లు ఆడాడు. బాగా ప్రాచుర్యం పొందాడు. రంజీ ట్రోఫీకి అతని పేరు పెట్టారు. దీని మొదటి సీజన్ 1934-35లో ఆడారు.