David Warner : అవసరమైతే ఆడేందుకు సిద్ధమే: వార్నర్

Update: 2024-07-09 05:17 GMT

ఆస్ట్రేలియన్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ ( David Warner ) అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. అయితే జట్టు ప్రయోజనాల కోసం వచ్చే ఏడాది జరిగే ఛాంపియన్స్ ట్రోఫీకి అందుబాటులో ఉంటానని చెప్పారు. ‘కొంత కాలం ఫ్రాంచైజీ క్రికెట్‌ను కొనసాగిస్తాను. ఒకవేళ ఛాంపియన్స్ ట్రోఫీకి ఎంపికైతే తప్పకుండా ఆడేందుకు సిద్ధమే’ అని ఇన్‌స్టా పోస్టులో రాసుకొచ్చారు. మరోవైపు తన వారసుడిగా మెక్‌గుర్క్‌ను వార్నర్ ఇప్పటికే ప్రకటించారు.

కాగా 37 ఏళ్ల డేవిడ్‌ వార్నర్‌.. ఇటీవల ముగిసిన టీ20 ప్రపంచకప్‌ 2024తో అంతర్జాతీయ కెరీర్‌కు గుడ్‌బై చెప్పాడు. ఈ ఏడాది జనవరి 1న వన్డేలకు.. జనవరి 10న టెస్టులకు వీడ్కోలు పలికాడు. టీ20 ప్రపంచకప్‌ 2024 తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌ నుంచి తప్పుకుంటానని చెప్పుకొచ్చాడు. నా వారసుడు ఇతడే అన్నట్లుగా ఆస్ట్రేలియా యంగ్ బ్యాటర్‌ జేక్‌ ఫ్రెజర్‌ మెక్‌ గుర్క్‌తో కూడిన ఫొటోను సోషల్‌ మీడియాలో పోస్టు చేశాడు.

కుటుంబానికి సమయం ఇవ్వాలని, ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న లీగ్‌లకు అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో రిటైర్మెంట్‌ తీసుకోవాలని భావిస్తున్నట్లు గతంలో వార్నర్‌ చెప్పాడు. దీంతో టీ20 ప్రపంచకప్‌తో అతడి అంతర్జాతీయ కెరీర్‌ ముగిసిందని అంతా భావించారు. కానీ అనూహ్యంగా వార్నర్‌ తన నిర్ణయాన్ని మార్చుకోవాలని చూస్తున్నట్లు తెలుస్తోంది.

Tags:    

Similar News