Anju Bobby George : అంజూ జార్జ్‌కు అరుదైన గౌరవం..!
Anju Bobby George : ఇండియన్ అథ్లెట్ అంజూ జార్జ్‌ను ప్రపంచ అథ్లెటిక్స్ అసోసియేషన్ అరుదైన గౌరవంతో సత్కరించింది. ఆమెను ‘వుమెన్ ఆఫ్ ది ఇయర్’ అవార్డుతో సత్కరించింది.;
Anju Bobby George
Anju Bobby George : ఇండియన్ అథ్లెట్ అంజూ జార్జ్‌ను ప్రపంచ అథ్లెటిక్స్ అసోసియేషన్ అరుదైన గౌరవంతో సత్కరించింది. ఆమెను 'వుమెన్ ఆఫ్ ది ఇయర్' అవార్డుతో సత్కరించింది. క్రీడారంగంలో ఆమె చేసిన కృషికి గుర్తింపుగా ఈ అవార్డు దక్కింది. ప్రతిష్టాత్మక అవార్డును అందుకోవడం తనకి ఎంతో అనందంగా ఉందని అంజూ ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ప్రపంచ అథ్లెటిక్స్ అసోసియేసన్‌కు ధన్యవాదాలు తెలిపారు.
ఈ అవార్డు అందుకున్న రెండో మహిళా క్రీడాకారిణి అంజూ కావడం విషేశం.. అమెకన్నా ముందుగా ఇథియోపియాకు చెందిన ఒలింపిక్ ఛాంపియన్ డిపార్టు తులు ఈ అవార్డును 2019లో అందుకున్నారు. కాగా కేరళకు చెందిన అంజూ.. 2003 పారిస్‌లో జరిగిన ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్స్, 2005 మొనాకోలో జరిగిన ఐఏఏఎఫ్ ప్రపంచ అథ్లెటిక్స్ ఫైనల్స్‌లో ఫైనల్‌లో బంగారు పతకం సాధించిన ఏకైక క్రీడాకారిణిగా నిలిచారు. ఇక 2016లో యువ క్రీడాకారిణులను ప్రోత్సహించేందుకు అకాడమీని ప్రారంభించారు. అమె శిక్షణలో చాలా మంది క్రీడాకారిణులు అండర్-20 విభాగంలో పతకాలు సాధించారు.
ఇక 2002-03లో అంజు ప్రతిభకు గుర్తింపుగా భారత ప్రభుత్వం అర్జున అవార్డును ప్రధానం చేసింది. 2003-04లో క్రీడారంగంలో అత్యున్నతమైన రాజీవ్ గాంధీ ఖేల్‌రత్న అవార్డు కూడా అంజు జార్జ్ కు ప్రధానం చేశారు. 2004లో భారతదేశంలో నాల్గవ అత్యున్నతమైన పౌర పురస్కారమైన పద్మశ్రీని స్వీకరించింది.