Diamond League: నొప్పి బాధిస్తున్నా వెనక్కి తగ్గలే
జ్యురిచ్ డైమండ్ లీగ్‌లో నీరజ్‌కు రెండో స్థానం.... 85.22 మీటర్ల దూరం జావెలిన్‌ను విసిరిన చోప్రా;
ప్రపంచ ఛాంపియన్(world champion), భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా(Neeraj Chopra)........ ప్రతిష్టాత్మక డైమండ్ లీగ్(Diamond League)లో రెండో స్థానంలో( finished second) నిలిచాడు. తొలి ప్రయత్నంలో నీరజ్ జావెలిన్‌ను 80.70 మీటర్ల దూరం విసిరాడు. అనంతరం రెండు, మూడు ప్రయత్నాల్లో ఫౌల్ అయ్యాడు. నాలుగు ప్రయత్నంలో 85.22 మీటర్లు( 85.22m) విసిరి రెండో స్థానంలోకి వచ్చాడు.
ప్రపంచ ఛాంపియన్ షిఫ్‌లో కాంస్యం గెలిచిన చెక్ రిపబ్లిక్‌కు చెందిన జాకుబ్ వాడ్లెజ్(Jakub Vadlejch) జావెలిన్‌ను 85.86 మీటర్లు దూరం విసిరి తొలి స్థానంలో నిలిచాడు.వీరిద్దరి మధ్య దూరం చాలా స్పల్పంగా ఉండడం గమనార్హం. ఫైనల్‌లో చోప్రా మూడు సార్లు ఫౌల్‌లు చేయడం తొలి స్థానం చేజారేలా చేసింది.
తొలి ప్రయత్నంలో నీరజ్ జావెలిన్‌ను 80.70 మీటర్ల దూరం విసిరాడు. అనంతరం రెండు, మూడు ప్రయత్నాల్లో ఫౌల్ అయ్యాడు. నాలుగు ప్రయత్నంలో 85.22 మీటర్లు విసిరి రెండో స్థానంలోకి వచ్చాడు. జూన్ 30న జరిగిన లౌసానేలో నీరజ్ అగ్రస్థానంలో నిలిచాడు. డైమండ్ లీగ్ డిఫెండింగ్ ఛాంపియన్ అయిన చోప్రా ఖాతాలో ప్రస్తుతం 23 పాయింట్లు ఉన్నాయి. సెప్టెంబర్‌లో యూజిన్‌లో డైమండ్ లీగ్ ఫైనల్ జరగనుంది. ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణం గెలిచిన తర్వాత...... తనకు భుజం, వెన్నునొప్పి వేధిస్తున్నాయని నీరజ్ చోప్రా చెప్పాడు. చోప్రా వంద శాతం ఫిట్‌గా లేనట్లు తెలుస్తోంది.
ఇటీవలే ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్స్ (World Championships)లో నీరజ్ చోప్రా స్వర్ణ పతకం సాధించి చరిత్ర సృష్టించాడు. ఫైనల్ పోరులో 88.17 మీటర్ల ఈటెను విసిరి పురుషుల జావెలిన్ త్రోలో విజేతగా నిలిచాడు. ఈ టోర్నీలో పసిడి నెగ్గిన తొలి భారతీయుడిగా రికార్డు నెలకొల్పాడు. అభినవ్ బింద్రా తర్వాత ఒలింపిక్స్, ప్రపంచ ఛాంపియన్‌షిప్స్ టైటిల్ రెండూ నెగ్గిన రెండో భారతీయుడుగా కూడా నీరజ్ రికార్టు సృష్టించాడు. 2021లో జరిగిన టోక్యో ఒలింపిక్స్‌లో పసిడి సాధించిన నీరజ్ (Neeraj Chopra) ట్రాక్ అండ్ ఫీల్డ్‌లో స్వర్ణ పతకం గెలిచిన తొలి భారతీయుడిగా రికార్డు సృష్టించాడు. లెజండరీ షూటర్ అభినవ్ బింద్రా తర్వాత ఒలింపిక్స్‌లో వ్యక్తిగత విభాగంలో పసిడి నెగ్గిన రెండో భారతీయుడిగా ఘనత సాధించాడు.