Sky Eye: గ్రహాంతరవాసులు ఉన్నాయి..! కనిపెట్టిన చైనా 'స్కై ఐ'..

Sky Eye: తాజాగా స్కై ఐ.. భూగోళం అవతల కూడా జీవాలు ఉన్నట్టు గుర్తించింది.

Update: 2022-06-15 11:35 GMT

Sky Eye: గ్రహాంతరవాసులు ఉన్నాయా? లేదా? ఇది ఎప్పటికీ ఎవరికీ అంతుచిక్కని ప్రశ్నే. అవి ఉన్నాయని ఇప్పటికీ శాస్త్రవేత్తలు ఎన్నోసార్లు అనుమానించినా.. కచ్చితంగా ఉన్నాయని చెప్పే ఆధారాలు మాత్రం పూర్తిస్థాయిలో ఇంకా ఎవరికీ లభించలేదు. అందుకే ఎన్నో ఏళ్లుగా శాస్త్రవేత్తలు ఈ చిక్కుముడిని విప్పడానికి ప్రయత్నిస్తూనే ఉన్నారు. తాజాగా గ్రహాంతరవాసులు ఉన్నాయని తెలిపే మరో సంఘటన చైనా శాస్త్రవేత్తలకు ఎదురయ్యింది.

2020 సెప్టెంబ‌ర్‌లో చైనా 'స్కై ఐ' అనే భారీ టెలిస్కోప్‌ను రూపొందించింది. ఈ టెలిస్కోప్‌ను వివిధ రకాల రేడియో సిగ్నల్స్‌ను కనిపెట్టడానికి, గ్రహాంతరవాసులు ఉన్నాయా లేదా అని తెలుసుకోవడానికి ఉపయోగకరంగా తయారు చేశారు. అయితే 2020లోనే రెండుసార్లు అనుమానిత సిగ్నల్స్ వచ్చాయి. ఇప్పటికీ ఆ సిగ్నల్స్‌పై స్టడీ జరగుతుండగానే తాజాగా మరోసారి అలాంటి సిగ్నల్స్ నమోదయినట్టు శాస్త్రవేత్తలు అంటున్నారు.

తాజాగా స్కై ఐ.. భూగోళం అవతల కూడా జీవాలు ఉన్నట్టు గుర్తించింది. ఈ విషయాన్ని చైనాకు సంబంధించిన ఓ మీడియా ప్రచురించిన తర్వాత దానిని డిలీట్ చేసింది. కానీ భూగోళం అవతల ప్రాణులు ఉన్నట్టు తెలిపే సిగ్నల్స్ స్కై ఐ కనిపెట్టడం నిజమేనని శాస్త్రవేత్తలు వెల్లడించారు. అవి గ్రహాంతరవాసులే అని తెలిపే ఆధారం కోసం శాస్త్రవేత్తలు డేటా స్టడీ చేస్తున్నట్టు సమాచారం.

Tags:    

Similar News