Phone Charging: మీ ఫోన్‌కి చాలా సేపు చార్జింగ్ పెడుతున్నారా.. అయితే..

Phone Charging: ఎక్కువైతే ఏదైనా కష్టమే. అన్నింటికీ వర్తించినట్లే ఫోన్ చార్జింగ్ విషయంలో కూడా.

Update: 2022-08-26 10:19 GMT

Phone Charging: ఎక్కువైతే ఏదైనా కష్టమే. అన్నింటికీ వర్తించినట్లే ఫోన్ చార్జింగ్ విషయంలో కూడా. చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు అందరికీ రోజంతా ఫోన్లతో పనే. అయితే, ఫోన్‌ను ఉపయోగించేటప్పుడు జాగ్రత్తగా ఉండటం కూడా చాలా ముఖ్యం. అక్కడక్కడా తరచుగా ఫోన్ పేలిన ఘటనలు వింటూ ఉంటాము. అలా జరక్కుండా ఉండాలంటే ఏం చేయాలో తెలుసుకుందాం.

ఫోన్ ఉపయోగిస్తున్నప్పుడు ఈ తప్పులను నివారించండి.

ఫోన్ బ్యాటరీలు పేలిపోవడానికి చాలా సేపు ఛార్జింగ్ పెట్టడమే ప్రధాన కారణం. ఫోన్‌కి గంటల తరబడి ఛార్జింగ్ పెడితే అలా చేయకండి. ఫోన్ పూర్తిగా ఛార్జ్ అయిన తర్వాత, ఛార్జర్‌ను తీసివేయండి.

చాలా మంది మొబైల్ బ్యాటరీ పాడైపోయిన తర్వాత డబ్బు ఆదా చేసేందుకు నకిలీ బ్యాటరీలను కొంటారు. ఇటువంటి బ్యాటరీలు త్వరగా చెడిపోతాయి లేదా పేలుడుకు గురవుతాయి.

ప్రస్తుతం, స్మార్ట్‌ఫోన్‌లతో పాటు ఫాస్ట్ ఛార్జర్‌లను అందిస్తున్నారు. అయితే, మరికొందరు ఫోన్‌తో పాటు వచ్చే ఛార్జర్‌కు బదులుగా ఇతర ఛార్జర్‌లను ఉపయోగిస్తున్నారు. ఇలా చేయడం వలన ఫోన్ బ్యాటరీ పాడైపోయి పేలిపోయే అవకాశం ఉంటుంది.

మీ ఫోన్‌ పేలకుండా ఉండాలంటే ఇలా చేయండి..

ఫోన్ పూర్తిగా ఛార్జ్ అయిన తర్వాత, దానిని పదేపదే ఛార్జ్ చేయవద్దు. అలాగే, ఓవర్‌ఛార్జ్ చేయవద్దు.

బ్యాటరీ పాడైపోయినట్లయితే, కంపెనీ స్టోర్ నుండి అసలు బ్యాటరీని కొనుగోలు చేయండి.

ఎల్లప్పుడూ కంపెనీ ఛార్జర్‌ని ఉపయోగించండి.

అలాగే మొబైల్ ఎక్కువసేపు సూర్యరశ్మికి గురికాకుండా చూసుకోవాలి

Tags:    

Similar News