AP: క్వాంటమ్ సైన్స్‌తో జాతీయ భద్రతకు కొత్త దిశ
క్వాంటమ్ కంప్యూటింగ్ రంగంలో ప్రపంచ దేశాల పోటీ
కంప్యూటింగ్, కమ్యూనికేషన్ల, సెన్సింగ్, సిమ్యులేషన్, ఎన్క్రిప్షన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, శాస్త్రీయ పరిశోధనలలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చే క్వాంటమ్ కంప్యూటింగ్ రంగంలో ప్రపంచ దేశాలు పోటీపడుతున్నాయి. అమెరికా, చైనా ముందంజలో ఉన్నాయి. చైనా ఇప్పటికే క్వాంటమ్ ఉపగ్రహాలు, భూతల క్వాంటమ్ నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసింది. భారత్ ఇప్పటికీ RSA, ECC వంటి గూఢలిపి సాంకేతికతలపై ఆధారపడుతోందని, అవి క్వాంటమ్ కంప్యూటర్ల చేత సులభంగా ఛేదించబడే అవకాశం ఉంది. ఈ కోడ్లపై భారతదేశపు రక్షణ, మౌలిక వసతులు, న్యుక్లియర్ నియంత్రణ, ఆర్థిక వ్యవస్థ, డిజిటల్ గుర్తింపు, కమ్యూనికేషన్లు ఆధారపడడం దేశ భద్రతకు కీలక ముప్పుగా మారుతుంది.
క్వాంటమ్ సెన్సర్ల వినియోగం, క్వాంటమ్ కీ డిస్ట్రిబ్యూషన్ నెట్‌వర్క్‌ల రూపకల్పనతో భారత రక్షణ వ్యవస్థకు గూఢచర్య సామర్థ్యాన్ని పెంచే అవకాశం ఉంది. భారత–పాక్ సరిహద్దులు, లద్దాఖ్, అరుణాచల్ ప్రదేశ్‌లో భూగర్భ బంకర్లు, సొరంగాల గుర్తింపు, సముద్ర జలాంతర్గాముల పర్యవేక్షణ వంటి అంశాల్లో క్వాంటమ్ సెన్సర్లు కీలకంగా ఉంటాయి. అలాగే, GPS ఆధారపడకుండా నౌకలు, విమానాలు, సబ్మెరిన్లు నడిపించడానికి కూడా వీటికి అవకాశం ఉంది. 2021లో క్వాంటమ్ ల్యాబ్, 2023లో జాతీయ క్వాంటమ్ మిషన్‌ను ప్రారంభించి 6,003 కోట్లు కేటాయించింది. IITలు, IISc, టాటా మౌలిక శాస్త్రాల సంస్థ, సైన్యం, పరిశోధకులు QKD, క్వాంటమ్ అల్గొరిథమ్స్, సిమ్యులేషన్లపై పనిచేస్తున్నారు. అమరావతిలో ఏర్పడే “క్వాంటమ్ వ్యాలీ” దేశానికి అణు, డిజిటల్, రక్షణ, వైద్య, ఫైనాన్స్ రంగాల్లో కీలక కేంద్రంగా మారుతుంది. స్వదేశీ QKD నెట్వర్క్, క్వాంటమ్ చిప్‌లు, సెన్సర్ ప్లాట్‌ఫారమ్‌లు విదేశీ ఆధారాన్ని తగ్గిస్తాయి. భారతం ఆత్మనిర్భరంగా, భవిష్యత్ క్వాంటమ్ సాంకేతికతలకు ఆధారంగా రక్షణ, సైబర్, గూఢచర్య సామర్థ్యాలను అభివృద్ధి చేసుకోవడం అత్యవసరమని ఈ విశ్లేషణ స్పష్టం చేస్తుంది. ప్రపంచ క్షేత్రంలో వెనుకబడకుండా నిలవాలంటే, క్వాంటమ్ రంగంలో పెట్టుబడులు, నైపుణ్యాల సృష్టి, స్వదేశీ మౌలిక సౌకర్యాల అభివృద్ధి కీలకమని తెలుస్తోంది.