Nandi Drinking Milk: దేవుడి విగ్రహం పాలు తాగడం వెనుక ఉన్న అసలు రహస్యం ఇదే..

Nandi Drinking Milk: విగ్రహాలు పాలు తాగడం వెనుక సైంటిఫిక్ రీజన్స్‌ వెతకడానికి శాస్త్రవేత్తలు ప్రయత్నించారు.

Update: 2022-03-09 14:40 GMT

Nandi Drinking Milk: దేవుడి మహిమలు అతీతమైనవి అని నమ్మేవారు చాలామందే ఉంటారు. అందుకే కాస్త వింతగా ఏదైనా జరిగినప్పుడు.. దాని వెనుక ఏదైనా కారణం ఉందా అని ఆలోచించే బదులు అది దేవుడి మహిమే అని నిర్ధారణకు వచ్చేస్తారు. ప్రస్తుతం నందీశ్వరుడు పాలు తాగుతున్న అంశం కూడా అలాంటిదే. అయితే నిజంగానే నందీశ్వరుడి విగ్రహం పాలు తాగుతోందని కొందరు అనుకుంటున్నారు. కానీ దీని వెనుక అసలు రహస్యం వేరే ఉంది.

విగ్రహాలు పాలు తాగడం వెనుక సైంటిఫిక్ రీజన్స్‌ వెతకడానికి కొందరు శాస్త్రవేత్తలు ప్రయత్నించారు. ఒక స్పాంజ్‌ని తీసుకుని నీళ్లలో పెడితే సహజంగానే అది నీళ్లను పీల్చుకుంటుంది. దీన్నే తలతన్యత అంటారు లేదా సర్ఫేస్‌ టెన్షన్ అంటారు. ఈ సైన్స్ సూత్రం ఆధారంగానే మొక్కలు, చెట్లు తమ వేర్ల ద్వారా నీటిని పీల్చుకుంటాయి. అంతెందుకు ఒక క్లాత్‌ను నీటికి అంటించినా సరే.. ఆ తడి పాకుతూ పైకి వెళ్తుంది. అంటే నీటిని అలా లాక్కుంటుంది.

దీపం వెలగడం వెనకున్న సైన్స్‌ కూడా ఇదే. ప్రమిదలో ఉన్న నూనెను దూది పీల్చుకుంటూ వెలుగుతుంది. ఈ గుణాన్నే తలతన్యత అని వివరించింది ఫిజిక్స్. ప్రస్తుతం దేవుడి విగ్రహాల విషయంలో జరుగుతున్నది కూడా అదే. కొన్ని రాతి విగ్రహాలు, ఇసుకరాయి లేదా మట్టితో తయారైన దేవుడి ప్రతిమలకు కొంతైనా నీటిని పీల్చుకునే గుణం ఉంటుంది.

విగ్రహానికి స్పూన్‌తో గాని గ్లాస్‌తో గాని నీరు లేదా పాలు తాగించినప్పుడు ఆటోమేటిక్‌గా ఆ విగ్రహం నీటిని పీల్చుకుంటుంది. దీన్ని సైంటిఫిక్‌గా నిరూపించి చూపించారు. సర్ఫేస్ టెన్షన్‌ అనే ప్రక్రియ వల్ల అలా జరుగుతుంది గాని దేవుడు పాలు తాగడం అనేది ఉండదని చెప్పారు. కావాలంటే.. ఏ బంగారంతోనో, వెండితోనో తయారుచేసిన విగ్రహాలకు తాగించి చూడండి. పాలు, నీళ్లు తాగడం అనేదే కనిపించదని చెప్తున్నారు.

Tags:    

Similar News