Phone Colour: మనిషి క్యారెక్టర్ గురించి చెప్పేసే ఫోన్ కలర్..
Phone Colour: మనం ఉపయోగించే ఫోన్ కలర్‌ను బట్టి మన వ్యక్తిత్వం గురించి చెప్పేయవచ్చు అంటున్నారు నిపుణులు.;
Phone Colour: ఈరోజుల్లో స్మార్ట్ ఫోన్ ఉపయోగించని వారు చాలా తక్కువ. ముందుగా ఒక స్మార్ట్ ఫోన్ కొనాలంటే అందులోని ఫీచర్స్‌నే చూస్తారు చాలామంది. కానీ కొందరు మాత్రం ఫోన్ కలర్ విషయంలో చాలా ప్రత్యేక శ్రద్ధ. తమకు ఒక ఫోన్‌లోని అన్ని ఫీచర్స్ నచ్చినా కూడా వారికి నచ్చిన కలర్ లేకపోతే కొనడానికి ఇష్టం చూపించరు. అయితే మనం ఉపయోగించే ఫోన్ కలర్‌ను బట్టి మన వ్యక్తిత్వం గురించి చెప్పేయవచ్చు అంటున్నారు నిపుణులు.
బ్లాక్
స్మార్ట్ ఫోన్ల విషయంలో చాలామంది ఎక్కువగా ప్రిఫర్ చేసే రంగు నలుపు. దాదాపు అన్ని బ్రాండ్ల స్మార్ట్ ఫోన్లు బ్లాక్ కలర్‌లో అందుబాటులో ఉంటాయి. చాలామంది బ్లాక్ ప్రిఫర్ చేస్తారు అనేదానికి ఇదే ఉదాహరణ. స్మార్ట్ ఫోన్ కంపెనీలు కూడా ఈ విషయాన్ని ఒప్పుకుంటాయి. నలుపు రంగు స్మార్ట్‌ఫోన్ ఉపయోగించేవారు స్మార్ట్‌గా, స్ట్రాంగ్‌గా ఉండటంతో పాటు మోడ్రన్‌గా ఆలోచిస్తూ ఉంటారట.
బ్లూ
బ్లాక్ కలర్ తర్వాత చాలామంది స్మార్ట్ ఫోన్ యూజర్లు ఎక్కువగా ఇష్టపడే కలర్ బ్లూ అని నిపుణులు అంటున్నారు. అయితే బ్లూ కలర్ ఫోన్ ఎంచుకునేవారు రిజర్వ్‌డ్‌గా, ప్రశాంతంగా ఉంటారట. అంతే కాకుండా ప్రతీ విషయంలో చాలా జాగ్రత్తలు పాటిస్తూ ఉంటారట. ప్రతి అంశాన్ని లోతుగా పరిశీలించడం, నిర్ణయాలు తీసుకోవడం లాంటి విషయాల్లో కూడా జాగ్రత్తగా ఉంటారట.
వైట్
వైట్ కలర్‌లో స్మార్ట్ ఫోన్లు ఉపయోగించేవారు ఎక్కువశాతం ఏదీ దాచుకోకుండా చెప్పే మనస్తత్వం కలిగి ఉండేవారని నిపుణులు చెప్తున్నారు. అంతే కాకుండా విచక్షణ లేకుండా ప్రవర్తిస్తారట. వారు ఉన్నత ప్రమాణాలను కలిగి ఉండడంతో పాటు అన్ని విషయాల్లో తామే టాప్ అనే ఫీలింగ్‌లో కూడా ఉంటారట.
రెడ్
రెడ్ కలర్‌లో స్మార్ట్ ఫోన్ ఉపయోగించేవారిని మనం చాలా అరుదుగా చూస్తుంటాం. కానీ ఐ ఫోన్ మాత్రం రెడ్ కలర్‌లో ఉంటే బాగుంటుంది అనుకునేవారి సంఖ్య ఎక్కువ. పైగా ఈ కలర్‌లో స్మార్ట్ ఫోన్ ఇష్టపడేవారికి దూకుడు ఎక్కువగా ఉంటుందట. వీరిలో పోటీతత్వంతో పాటు ఇతరుల దృష్టిని తమవైపు మళ్లించుకోవాలి అనే కోరిక కూడా ఉంటుందట.
గోల్డ్
అన్ని రంగులతో పోలిస్తే ప్రత్యేకంగా గోల్డ్ కలర్‌లో స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేయాలనుకునేవారి సంఖ్య చాలా తక్కువ. అయితే గోల్డ్ కలర్ స్మా్ర్ట్ ఫోన్ ఉపయోగించేవారు చాలా హుందాగా ఉంటారట. సోషల్ స్టేటస్ విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉంటారట. పైగా గోల్డ్ కలర్ స్మార్ట్ ఫోన్‌ను ఇష్టపడే వారు లగ్జరీ వస్తువులపై కూడా ఆసక్తి చూపిస్తారట.