బెంగళూరు నుంచి వారణాసికి బయలుదేరిన ఇండిగో విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది. అత్యవసరంగా హైదరాబాద్ లోని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండ్ చేశారు. మంగళవారం ఉదయం బెంగళూరు నుంచి వారణాసికి బయలుదేరిన ఇండిగో విమానానికి ఉదయం 6.15 గంటలకు సాంకేతిక సమస్య ఏర్పడినట్లు పైలెట్లు గుర్తించారు. శంషాబాద్ లో విమానం ల్యాండ్ అయిన తర్వాత ప్రయాణికులు ఊపిరిపీల్చుకున్నారు. ప్రయాణికులంతా క్షేమంగా ఉన్నట్లు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) వెల్లడించింది. మరింత సమాచారం తెలియాల్సి ఉంది.