ఘనంగా పార్టీ ఆవిర్భావ దినోత్సవం : మంత్రి కేటీఆర్

Update: 2023-04-09 11:32 GMT

పార్టీ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించుకోవాలని భారత రాష్ట్ర సమితి నిర్ణయించింది. ఇందులో భాగంగా ఈ నెల 27న తెలంగాణ భవన్‌లో వేడుకలు జరుగనున్నా యి. ఈ విషయాన్ని పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌ తెలిపారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా విస్తృతంగా నిర్వహిస్తున్న ఆత్మీయ సమ్మేళనాల కార్యక్రమాలకు పార్టీ శ్రేణుల నుంచి మంచి స్పందన వస్తుందని తెలియశారు.

ఈ నెల 25న నియోజకవర్గ స్థాయి పార్టీ ప్రతినిధుల సభలు నిర్వహించాలని, ఈ సమావేశాలు పార్టీ నియమించిన ఇన్‌ఛార్జ్‌లు, స్థానిక ఎమ్మెల్యేల అధ్యక్షతన కొనసాగుతాయన్నారు. జిల్లా పార్టీ అధ్యక్షులు సమావేశాల నిర్వహణను సమన్వయం చేస్తారని చెప్పారు. ప్రతి నియోజక వర్గంలోని అన్నీ గ్రామాలు, వార్డుల్లో ఆ రోజు ఉదయమే పండుగ వాతావరణంలా పార్టీ జెండాల ను ఎగ రవేయాలని.. అనంతరం నియోజకవర్గ కేంద్రాల్లోని ప్రతినిధులు సభకి చేరుకోవాలని సూచించారు. 25న రోజంతా పార్టీ నియోజకవర్గ ప్రతినిధుల సభ నిర్వహణ జరుగుతుందన్నారు.


ఈ నెల 27న హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆవిర్భావ దినోత్సవాన్ని నిర్వహించనున్నట్లు కేటీఆర్ తెలిపారు. తెలంగాణ భవన్‌లో జనరల్‌ బాడీ సమావేశం ఉంటుందని, పార్టీ అధ్యక్షుడు కేసీఆర్‌ అధ్యక్షతన సమావేశం జరుగుతుందన్నారు. సమావేశంలో సుమారు 300 మంది పార్టీ ప్రతినిధులు పాల్గొంటారన్నారు. ఆ రోజు ఉదయం కేసీఆర్ పార్టీ జెండాను ఎగుర వేసి, సమావేశాన్ని ప్రారంభిస్తారన్నారు. సమావేశంలో పలు రాజకీయ తీర్మానాలను ప్రవేశ పెట్టి, విస్తృతంగా చర్చించి, వాటిని ఆమోదించు కోవడం జరుగుతుందని తెలిపారు. అక్టోబర్‌ 10న భారత రాష్ట్ర సమితి వరంగల్‌ మహాసభను నిర్వహించనున్నట్లు వెల్లడించారు.

Similar News