చిల్లేపల్లి టోల్ గేట్ వద్ద ఉద్రిక్తత, 150కి పైగా లారీలను ఆపిన పోలీసులు

Update: 2023-04-09 10:25 GMT

నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం ఆలగడప-చిల్లేపల్లి టోల్ గేట్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. పక్క జిల్లాల నుంచి వస్తున్న ధాన్యం లారీలను రాత్రి నుంచి టోల్ గేట్ వద్ద అడ్డుకుంటున్నారు పోలీసులు. దీంతో సుమారు 150కి పైగా లారీలు టోల్ గేట్ వద్దే నిలిచిపోయాయి. లారీలను నిలిపివేయడంపై పోలీసులతో డ్రైవర్లు వాగ్వాదానికి దిగుతున్నారు. పచ్చి ధాన్యం కావడంతో కుళ్లిపోయే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక పోలీసుల తీరుపై లారీ ఓనర్లు భగ్గుమంటున్నారు. ముందస్తు సమాచారం లేకుండా ఎలా అడ్డుకుంటారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Similar News