Hyderabad: హైదరాబాద్‌లో 100 మంది ఫేక్‌ డాక్టర్లు

వీళ్ల మాయలో చిక్కితే ఇక అంతే సంగతి..!;

Update: 2024-12-08 05:15 GMT

నకిలీ డాక్టర్లకు హైదరాబాద్‌ కేంద్రంగా మారుతోంది. అర్హత లేకున్నా నాడి పట్టి నకిలీ డాక్టర్లు రోగుల ప్రాణాలను పణంగా పెడుతున్నారు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లాల్లో ఇప్పటివరకు 100 మంది నకిలీ వైద్యుల గుట్టు బయట పడింది. తెలంగాణ మెడికల్‌ కౌన్సిల్‌ తనిఖీల్లో ఎలాంటి MBBS, ఇతర వైద్య పట్టాలు లేకుండానే ప్రాక్టీసు చేస్తున్నట్లు గుర్తించారు.

కాస్త అనుభవంతో : వైద్యులుగా చెలామణి అవుతున్న ఈ నకిలీ డాక్టర్ల వద్ద సరైన పట్టాలు ఉండవు. కొంతమంది నకిలీ పట్టాలు సృష్టించి క్లినిక్‌లు నడపుతున్నారు. కొంతమంది ఏవో గుర్తింపు లేని యూనివర్సిటీల నుంచి పట్టాలు కొనుక్కొని డాక్టర్లుగా ఆస్పత్రులే పెడుతున్నారు. మెడికల్‌ షాపులు కూడా పెట్టించి అనుమతులు లేకుండా మందులను అమ్ముతున్నారు.

దాదాపు 140 వరకు ఇలాంటి షాపులను ఔషధ నియంత్రణ శాఖ గుర్తించింది. హోల్‌సేల్‌ డీలర్లు కూడా ఇలాంటి క్లినిక్‌లకు మందులను సరఫరా చేస్తూ ఉన్నారు. బస్తీలు, మురికి వాడలను లక్ష్యంగా చేసుకొని క్లినిక్‌లు పెడుతున్నారు. ప్రైవేటు ఆసుపత్రుల్లో కన్సల్టెంట్‌ ఫీజులు రూ.500 నుంచి రూ.1500 వరకు ఉండటం, ఈ నకిలీ వైద్యులు రూ.50, రూ.100 వసూలు చేస్తుండటంతో పేదలు ఎక్కువ మంది వీరి దగ్గరకు వెళ్తున్నారు.

అధిక మోతాదుతో కూడిన మందులు : కొందరు నకిలీ డాక్టర్లు క్లినిక్​కు వెళ్లిన రోగులకు అవగాహన లేక అధిక మోతాదుతో కూడిన మందులను ఇస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ముఖ్యంగా హై యాంటీ బయోటిక్స్‌తో అప్పటికప్పుడు రోగం నయం అనిపిస్తుంది. కానీ కొన్నిరోజుల తర్వాత తీవ్ర అనారోగ్య సమస్యలకు దారి తీస్తుంది. కీళ్ల నొప్పులు, ఇతర సమస్యలకు స్టెరాయిడ్లు ఇస్తున్నారని గుర్తించారు. 

వీరి వలలో చిక్కితే ఆరోగ్యం దెబ్బతినటం ఖాయమని నీట్రీజీఎంసీ వైస్‌ఛైర్మన్‌ డాక్టర్‌ జి.శ్రీనివాస్‌ వెల్లడించారు. ఈ క్లినిక్‌లకు వెళ్లిన రోగులకు నకిలీ డాక్టర్లు అధిక మోతాదుతో కూడిన మందులను సిఫార్సు చేస్తున్నట్లు తెలిపారు. ముఖ్యంగా హై యాంటిబయోటిక్స్‌తో అప్పటికప్పుడు రోగం నయం అయినట్లు అనిపించినా...దీర్ఘకాలంలో అది తీవ్ర అనారోగ్య సమస్యలకు దారి తీస్తుందని అంటున్నారు. కీళ్ల నొప్పులు ఇతర సమస్యలకు స్టెరాయిడ్లు ఇస్తున్నట్లు తేలింది.

Tags:    

Similar News