బెల్లంపల్లి ఐసోలేషన్ కేంద్రంలో 11 మంది మృతి
మంచిర్యాల జిల్లాలో బెల్లంపల్లి ఐసోలేషన్ కేంద్రంలో వరుస మరణాలు కలకలం రేపుతున్నాయి. కేవలం 30 గంటల్లో 11 మంది కరోనా రోగులు మృతి చెందారు.;
మంచిర్యాల జిల్లాలో బెల్లంపల్లి ఐసోలేషన్ కేంద్రంలో వరుస మరణాలు కలకలం రేపుతున్నాయి. కేవలం 30 గంటల్లో 11 మంది కరోనా రోగులు మృతి చెందారు. నిన్న ఉదయం 8 గంటల నుంచి నేడు ఉదయం ఎనమిది గంటల వరకు ఎనమిది మంది మృతి చెందారు. తాజాగా మరో ముగ్గురు మరణించారు. ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొంది పరిస్థితి విషమించిన తర్వాత ఐసోలేషన్ సెంటర్ కి వస్తున్నట్లుగా అక్కడి వైద్యులు చెబుతున్నారు. ఇటీవలె మత్తు వైద్యులతో పాటు ఛాతీ వైద్యుడు, టెక్నిషియన్ను అధికారులు నియమించారు. అయినప్పటికీ రోగులు భారీ సంఖ్యలో మృతి చెందడం కలవరపెడుతోంది.