Harish Rao : గాంధీ ఆసుపత్రిలో 16 అడుగుల గాంధీ విగ్రహం..
Harish Rao : హైదరాబాద్ గాంధీ ఆస్పత్రిని మంత్రులు హరీష్ రావు, తలసాని శ్రీనివాస యాదవ్ సందర్శించారు;
Harish Rao : హైదరాబాద్ గాంధీ ఆస్పత్రిని మంత్రులు హరీష్ రావు, తలసాని శ్రీనివాస యాదవ్ సందర్శించారు. అక్టోబరు 2న గాంధీ జయంతిని పురష్కరించుకుని... ఏర్పాటు చేయనున్న 16 అడుగుల గాంధీ విగ్రహ ఏర్పాటు పనులను పరిశీలించారు. సీఎం కేసీఆర్ చేతుల మీదుగా 16 అడుగుల గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నట్లు తెలిపారు. ఇక నెల్సన్ మండేలా లాంటివారు కూడా గాంధీ చూపిన అహింసా మార్గాన్ని అవలంభించారని అన్నారు మంత్రి హరీష్ రావు. కేసీఆర్ సైతం 14 ఏళ్లు అహింసా మార్గంలో ఉద్యమం చేపట్టి తెలంగాణను సాధించారని అన్నారు.
దేశానికి స్వాతంత్ర్యం తెచ్చిన గాంధీని వదిలి... గాడ్సేను కొలుస్తున్న వ్యవస్థను చూస్తున్నామన్నారు మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్. తెలంగాణలో స్వాతంత్ర్య వజ్రోత్సవాలు ఘనంగా జరుపుకున్నామని... గాంధీ సినిమాను ప్రదర్శిస్తే లక్షలాది మంది ప్రేక్షలు వీక్షించారని కొనియాడారు.