తండ్రి అతివేగానికి ఇద్దరు కుమారులు బలి
ములుగు జిల్లా మంగపేటలో రోడ్డు ప్రమాదం జరిగింది. బైకర్ నిర్లక్ష్యం వల్ల రెండు ప్రాణాలు బలయ్యాయి;
ములుగు జిల్లా మంగపేటలో రోడ్డు ప్రమాదం జరిగింది. బైకర్ నిర్లక్ష్యం వల్ల రెండు ప్రాణాలు బలయ్యాయి. ఇద్దరు కుమారులు, భార్యతో కలిసి బైక్ పై అతివేగంగా వెళ్లిన బైకర్‌ను ఆర్టీసీ బస్సు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు చిన్నారులు అక్కడికక్కడే మృతి చెందారు. తల్లిదండ్రులకు తీవ్ర గాయాలు అయ్యాయి. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇక ప్రమాద దృశ్యాలు సీసీ ఫుటేజ్‌లో రికార్డు అయ్యాయి. బైకర్ అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు వెల్లడించారు.