Minister Ponnam : ఆర్టీసీలో కొత్తగా 3,039 ఉద్యోగాలు: మంత్రి పొన్నం

Update: 2024-12-18 07:30 GMT

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC)లో కొత్తగా 3,039 ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ అసెంబ్లీలో వెల్లడించారు. జిల్లా కేంద్రాలకు లింక్ రోడ్లు ఏర్పాటు చేయబోతున్నామని, వేములవాడ, ధర్మపురి, కొండగట్టు క్షేత్రాలను కలుపుతూ బస్సుల లింకింగ్ ఏర్పాటు చేస్తామన్నారు. రాష్ట్ర ఆవిర్భావం సమయంలో RTCలో 55,000 మంది ఉద్యోగులుంటే, ప్రస్తుతం 40,000 మంది ఉన్నారని చెప్పారు. 15 ఏళ్లు దాటిన బస్సులను స్క్రాప్‌కు పంపిస్తున్నామన్నారు. మహాలక్ష్మి పథకం అమలు తర్వాత బస్సు ప్రయాణాలపై ఎప్పటికప్పుడు సమీక్షలు చేస్తూ పలు కీలక నిర్ణయాలు తీసుకుంటోంది టీజీఎస్ఆర్టీసీ. పెరిగిన రద్దీకి అనుగుణంగా కొత్త బస్సులను కొనుగోలు చేసేందుకు ప్లాన్‌ చేస్తూ త్వరలోనే పెద్ద ఎత్తున ఎలక్ట్రిక్​ బస్సులు రోడ్లపైకి తీసుకొచ్చేలా కసరత్తులు చేస్తోంది. ప్రయాణికుల భద్రత కోసం బస్సుల్లో డ్రైవర్ మానిటరింగ్ సిస్టం,అడ్వాన్స్ డ్ డ్రైవర్ అసిస్టెంట్ సిస్టంను అమలు చేయాలని సంస్థ నిర్ణయించిందని TGSRTC MD సజ్జనార్ తెలిపారు. రాబోయే రోజులు సంస్థకు చాలా కీలకం అని అన్నారు.

Tags:    

Similar News