Telangana corona cases : తెలంగాణలో కొత్తగా 3,043 కరోనా కేసులు..!
Telangana corona cases : తెలంగాణలో కరోనా ఉదృతి కొనసాగుతూనే ఉంది. నిన్న కాస్త తగ్గిన కరోనా కేసులు మళ్ళీ పెరిగాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 3,043 కొత్త కేసులు నమోదు అయ్యాయి.;
coronavirus(File Photo)
Telangana corona cases : తెలంగాణలో కరోనా ఉదృతి కొనసాగుతూనే ఉంది. నిన్న కాస్త తగ్గిన కరోనా కేసులు మళ్ళీ పెరిగాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 3,043 కొత్త కేసులు నమోదు అయ్యాయి. అటు కరోనాతో మరో 21 మంది మృతి చెందారు. తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 5,56, 320కి చేరుకుంది. అటు మరణాల సంఖ్య 3,146కి పెరిగింది. మరోవైపు కరోనాతో 4,693మంది కోలుకున్నారు. కాగా ప్రస్తుతం తెలంగాణలో 39,206 యాక్టివ్ కేసులున్నాయి. GHMCలో అత్యధికంగా 424 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ ని విడుదల చేసింది.