KTR : ఇంకా 35 రోజులే .. మోసగాళ్లకు కౌంట్ డౌన్ స్టార్ట్ : కేటీఆర్ ట్వీట్
కాంగ్రెస్ ప్రభుత్వం టార్గెట్ గా మాజీ మంత్రి కేటీఆర్ వరుస ట్వీట్లు చేశారు. అన్నివర్గాలను సర్కార్ మోసం చేసిందటూ విమర్శించారు. కాంగ్రెస్ హామీలపై ఢిల్లీ బాబు రాహుల్ గాంధీ సమాధానం చెప్పా లని డిమాండ్ చేశారు. 'వంద రోజుల్లో నెరవేరుతుంది ప్రతి గ్యారెంటీ' అని చెప్పిన మోసగాళ్లకు కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యింద ని అన్నారు. ప్రజా పాలనలో 330 రోజులు ముగిశాయని.. ఏడాది నిండడానికి కేవలం ఇంకా 35 రోజులే మిగిలి ఉన్నాయని గు ర్తుచేశారు. చెప్పిన హామీలన్నీ బూడిదలో పన్నీరయ్యారని.. చెప్పని మూసీలో లక్షల కోట్ల మూటలాయే అని ఎద్దేవాచేశారు. ఏడాది కాలమంతా అటెన్షన్ డైవర్షన్ తో పబ్బం గడిపారని మండిపడ్డారు. ఏముంది ఈ ప్రజా పాలనలో గర్వకారణం ధర్నాలు, రాస్తారోకోలు తప్ప? అని నిలదీశారు. అసలేమీ లేవు
ధాన్యం కొనుగోలు విషయంలో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. 'నీళ్లల్లో ధాన్యం ధర్నాలో - రైతుషరతుల్లో మిల్లర్లు పెండ్లిళ్లలో సీఎం, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు. తెలంగాణ రైతన్న నడ్డివిరిచి గాల్లో విహరిస్తు న్న మోసకారి కాంగ్రెస్. దసరా పోయింది, దీపావళి పోయింది, కార్తీకమాసమొచ్చినా కానరాని కొనుగోళ్లు. నాడు గింజగింజ కు కేసీఆర్ హామీ - నేడు గడియగడియ గండమే. మిల్లర్లతో చర్చలు లేవు - రైతుకు భరోసా కరువు- అన్నదాతను గాలికి వదిలిన గాలి మోటార్ సర్కార్. ధాన్యం కొంటే 500 బోనస్ - అసలు కొనకుంటే అంతా బోగస్. సమీక్ష లేదు. సమావేశం లేదు. ధాన్యంపై కప్పే కవర్లు లేవు. అసలు సమయమే లేదు. రుణమాఫీ, రైతు బంధు, రైతు బీమా లేదు. చివరకు పంట కొనుగో ళ్లు లేవు. లేవు లేవు లేవు అసలేమీ లేవు ఈ అసమర్థపు సన్నాసి పాలనలో ఏమిలేవు' అని అంటూ ట్వీట్ చేశారు.