TG Deputy CM : జనవరి నాటికి 4 వేల మెగావాట్ల పవర్ : డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క

Update: 2025-08-02 08:45 GMT

వచ్చే జనవరి నాటికి 4 వేల మెగా వాట్ల పవర్ అందుబాటులోకి తీసుకువస్తామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ప్రజాధనం వృథా కాకుండా నిరంతరం పర్యవే క్షిస్తూ నిర్ణీత సమయానికి పవర్ ప్లాంట్ పూర్త య్యేలా పనులు చేపడుతున్నట్లు తెలిపారు. నల్ల గొండ జిల్లా దామరచర్ల మండలం వీర్లపాలెం సమీపంలో నిర్మిస్తున్న యాదాద్రి థర్మల్ ప్లాంట్ పనుల పురోగతిపై జెన్ కో, బీహెచ్ఎల్ ఉన్నత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వ హించారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ 'వైటీపీఎస్ స్టేజ్ 1లో 2 యూనిట్లను ప్రారంభిం చాం. స్టేజ్ IIలో మిగిలిన 3 యూనిట్లు ఈ సంవ త్సరం చివరి నాటికి అందుబాటులోకి వస్తాయి. ఎన్విరాన్మెంట్ జాప్యం వల్ల రెండేండ్లు లేట్ అయ్యింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజాభిప్రాయ సేకరణ జరిపి పనుల్లో వేగం పెంచాం. అధికారులు, కార్మి కులు శ్రద్ధగా పనిచేస్తున్నారు. ఈ ప్రాంతంలో ఇంటర్నేషనల్ స్కూల్, కార్పొరేట్ హాస్పిటల్, పనిచేసే సిబ్బందికి సుమారు రూ. 100 కోట్లతో 55 ఎకరాల్లో క్వార్టర్స్ ఏర్పాటు చేస్తున్నం. ప్రజ లకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా రోడ్లను అభివృద్ధి చేస్తం. భూములు కోల్పోయిన ప్రతి ఒక్కరికీ న్యాయం చేస్తం. వారికి ఉద్యోగాలు కల్పిస్తం' అని తెలిపారు.

Tags:    

Similar News