తెలంగాణలో కొత్తగా 535 కరోనా పాజిటివ్ కేసులు

తెలంగాణలో కొత్తగా 535 కరోనా పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. మొత్తం 57 వేలమందికి పరీక్షలు చేస్తే 535 మందిలో కోవిడ్ నిర్థారణ అయ్యింది

Update: 2021-03-28 08:00 GMT

తెలంగాణలో కొత్తగా 535 కరోనా పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. మొత్తం 57 వేలమందికి పరీక్షలు చేస్తే 535 మందిలో కోవిడ్ నిర్థారణ అయ్యింది. వీరిలో మెజార్టీ శాతం మంది ఇంట్లోనే హోమ్ ఐసోలేషన్‌లో ఉండి చికిత్స పొందుతున్నారు. ఇక.. GHMC పరిధిలో 154 కేసులు నమోదైతే.. పక్క జిల్లాల్లోనూ భారీగా పాజిటివ్‌లు ఉన్నారు. గడిచిన 24 గంటల్లో ముగ్గురు చనిపోయారు. దీంతో.. మొత్తం కోవిడ్ మరణాలు రాష్ట్రంలో 16 వందల 88కి చేరాయి. రాష్ట్రంలో ప్రస్తుతం యాక్టివ్ కేసులు 4 వేల 495 ఉన్నాయి.

తెలంగాణలో కరోనా విజృంభణతో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ తప్పనిసరి చేసింది. బహిరంగ ప్రదేశాలతో పాటు ప్రయాణాలు, పని ప్రాంతాల్లో మాస్క్ తప్పనిసరి చేస్తూ ఉత్తర్వులు జారీచేసింది. నిబంధనలు ఉల్లఘించిన వారిపై విపత్తు నిర్వహణ చట్టం కింద కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లు, పోలీసులను ఆదేశించింది.

ఈ చట్టం ప్రకారం వెయ్యి రూపాయల జరిమానాతో పాటు ఆరు నెలల జైలు శిక్ష విధించే అవకాశం ఉంది. మరోవైపు వేడుకలపైనా నిషేధం విధించింది. ఏప్రిల్ 30వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయని పేర్కొంది. హోలీ, ఉగాది, శ్రీరామనవమి, రంజాన్, గుడ్ ఫ్రైడే వంటి పండుగలపై ఆంక్షలు విధిస్తూ సీఎస్ సోమేశ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.

Tags:    

Similar News